నగ్మా ఎర.. రానన్న రజినీ..


‘డబ్బుకు డబ్బు.. అధికారానికి అధికారం.. ఒక్క చాన్స్ ఇవ్వు రజినీ.. నిన్ను సీఎం చేస్తాం’ అని అధికార బీజేపీ నుంచి రజినీకాంత్ కు మరోసారి ఆఫర్ వచ్చింది. యూపీలో బీజేపీ తరఫున గతంలో పోటీచేసిన హీరోయిన్ నగ్మాను రజినీకాంత్ దగ్గరకు పంపి బీజేపీ రాయాబారం నడిపింది. కానీ తలైవా.. బీజేపీలో చేరేందుకు.. రాజకీయాల్లోకి వచ్చేందుకు ఇది సమయం కాదని తేల్చిపారేశారు. దీంతో కేవలం ఇది పరిచయ భేటి అని నగ్మా చైన్నైలో రజినీకాంత్ ను కలిశాక విలేకరులకు తెలిపింది..

తమిళనాడులో ఎలాగైనా పాగా వేయాలని భావిస్తున్న బీజేపీ అన్నాడీఎంకే పార్టీతో ఆడుకుంటోంది. పన్నీర్ సెల్వం అండగా., ఫళని స్వామి సర్కారును కుదిపేస్తోంది. శశికళను జైలుకు పంపింది. బీజేపీని తమిళనాడులో బలమైన పార్టీగా రూపొందించేందుకు సరైన నాయకుడి కోసం బీజేపీ అన్వేషిస్తోంది. అందుకే స్టార్ హీరో రజినీకాంత్ ను రాజకీయా్ల్లోకి రావాలని కోరుతోంది. ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షాలు ఇప్పటికే కోరినా రజినీ రాజకీయ ప్రవేశాన్ని వాయిదా వేస్తూనే ఉన్నారు. ఇప్పుడు బీజేపీ అధిష్టానం  రాజకీయాల్లోకి రావాలని నగ్మాను దూతగా తలైవాకు వర్తమానం పంపింది. అయినా ఆయన నో చెప్పారు.

రజినీకాంత్ తన అభిమానులతో చైన్నైలో భేటి అయ్యారు. వారంతా రజినీ రాజకీయాల్లోకి రావాలని కోరారు. దేవుడు ఆదేశిస్తే తప్పకుండా రాజకీయాల్లోకి వస్తానని రజినీ చెప్పారు. దీంతో బీజేపీ నగ్మాను రాయబారంగా పంపినా ఆయన ఒప్పుకోలేదు. తమిళనాడులో స్టార్ హీరో అయిన రజినీకాంత్ రాజకీయా్లలోకి వస్తే ఆయనకు జనం బ్రహ్మరథం పట్టడం ఖాయం. అందుకే ఆయన్ను, ఆయన క్రేజ్ ను ఉపయోగించుకొని తమిళనాడు రాజకీయాలను శాసించాలని బీజేపీ శతథా ప్రయత్నిస్తోంది. కానీ దేవుడి పేరు చెప్పి రజినీ తప్పించుకుంటున్నారు. ఒకింత రాజకీయాల్లోకి వస్తే నిలబడగలనా.. చిరంజీవిలా పడిపోతానా అన్న సందేహం రజినీలో ఉంది. అందుకే తటపటాయిస్తున్నారు. బహుశా వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రజినీ అంతరంగం మారి రాజకీయాల్లోకి రావచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.

To Top

Send this to a friend