చైతూ మూవీ వేడుక రద్దు..

అక్కినేని నాగార్జున నిర్మించిన ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ సినిమా ఆడియో నేడు విడుదల అవ్వాల్సి ఉంది. కాని నేడు ఉదయం నాగార్జున బావగారు, హీరో సుశాంత్‌ తండ్రి అయిన అనుమోలు సత్యభూషణ రావు మృతి చెందారు. దాంతో నేడు జరగాల్సిన అక్కినేని సినిమా వేడుకను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినా కూడా కుటుంబంలో చోటు చేసుకున్న పెను విషాదం కారణంగా ఆపేయాల్సిందే అంటూ నాగార్జున ఆర్డర్‌ వేశారు.

గత రెండు సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్న అనుమోలు సూర్యభూషణ రావు మృతితో అక్కినేని కుటుంబం మొత్తం శోఖ సంద్రంలో మునిగి పోయింది. ఈ సమయంలో వేడుక చేయడం సరైన పద్దతి కాదనే ఉద్దేశ్యంతో ఆడియో వేడుకను తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగింది. ఇటీవలే విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తున్న నేపథ్యంలో ఫ్యాన్స్‌ మరియు ప్రేక్షకులు ఆడియో కోసం ఎదురు చూస్తున్నారు.

‘సోగ్గాడే చిన్ని నాయన’ వంటి బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌తో దర్శకుడిగా పరిచయం అయిన కళ్యాణ్‌ కృష్ణ తాజాగా ఈ సినిమాను తెరకెక్కించాడు. సోగ్గాడే తరహాలోనే ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ చిత్రాన్ని పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు తెరకెక్కించాడు. ఈ చిత్రంతో చైతూకు ఒక భారీ కమర్షియల్‌ సక్సెస్‌ ఖాయం అని అక్కినేని ఫ్యాన్స్‌ నమ్మకంగా ఉన్నారు.

To Top

Send this to a friend