చైతూ, సమంతల పెళ్లి డేట్‌ ఫిక్స్‌..

నాగచైతన్య, సమంతలు ప్రేమలో పడటం, వారిద్దరి ప్రేమలు పెద్దలు అంగీకరించి, వారి వివాహ నిశ్చితార్థం చేయడం జరిగి పోయింది. కొంత కాలంగా సమంత, చైతూలు సహజీవనం సాగిస్తున్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ సమయంలోనే నాగచైతన్య, సమంతల వివాహ తేదీ ఫిక్స్‌ అయినట్లుగా ప్రచారం జరుగుతుంది. మొదట బ్యాంకాక్‌లోని ఒక ప్రముఖ చర్చ్‌లో వీరి వివాహం ఉంటుందని అన్నారు. అయితే తాజాగా గోవాలో పెళ్లి అంటూ వార్తలు వస్తున్నాయి.

గోవాలోని ఒక చర్చ్‌లో మొదట సమంత, నాగచైతన్యల వివాహం జరుపనున్నారు. ఆ తర్వాత హిందూ సాంప్రదాయం ప్రకారం మరోసారి వారి వివాహం జరుగబోతుంది. గోవాలోనే వివాహం చేసుకుని, ఆ తర్వాత రెండు రోజులకు హైదరాబాద్‌ లేదా చెన్నైలో వివాహ రిసెప్షన్‌ను నిర్వహించే అవకాశాలున్నాయి.

గోవాలో వివాహంపై అక్కినేని ఫ్యామిలీ నుండి ఇంకా ఎలాంటి అధికారిక క్లారిటీ రాలేదు. అక్టోబర్‌ 6న వివాహం అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై కూడా ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం నాగచైతన్య మరియు సమంతలు వరుస చిత్రాలతో చాలా బిజీగా ఉన్నారు. వీరి సినిమాలు ఆగస్టు సెప్టెంబర్‌ వరకు పూర్తి చేసి ఆ తర్వాత అక్టోబర్‌లో వివాహంకు సిద్దం కాబోతున్నారు. వీరి వివాహం కోసం అక్కినేని ఫ్యాన్స్‌తో పాటు తెలుగు మరియు తమిళ ప్రేక్షకులకు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీరి జంట చూడ ముచ్చటగా ఉంటుందనే టాక్‌ ఉంది.

To Top

Send this to a friend