తనయుడిపై చాలా నమ్మకంగా ఉన్న నాగ్‌

అక్కినేని నాగచైతన్య హీరోగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా ‘సోగ్గాడే చిన్ని నాయన’ ఫేం కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’. ఈ సినిమా ఆడియో వేడుక తాజాగా వైభవంగా జరిగింది. భారీ అంచనాలున్న ఈ సినిమా ఆడియో వేడుకలో నాగార్జున మాట్లాడిన మాటలు సినీ వర్గాల్లో మరియు సినీ ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు భారీగా పెంచేస్తున్నాయి. సినిమా వాయిదా పడుతుందనే పుకార్లు వస్తున్న నేపథ్యంలో నాగార్జున స్పందిస్తు ఈనెల 26న వస్తున్నాం, సక్సెస్‌ను కొడుతున్నాం అంటూ నమ్మకంగా చెప్పుకొచ్చాడు.

నాగార్జున ఈ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఇప్పటికే బిజినెస్‌ పూర్తి అయిన ఈ సినిమా ద్వారా నాగార్జున విడుదలకు ముందే 10 కోట్ల వరకు లాభాలను దక్కించుకున్నట్లుగా ట్రేడ్‌ వర్గాల వారు చెబుతున్నారు. కేవలం 10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 20 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చేసింది. సినిమా సక్సెస్‌ అయితే నిర్మాత నాగార్జునకు లాభాలే లాభాలు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌ సినిమా స్థాయిని అమాంతం పెంచేసింది. ఇక తాజాగా విడుదలైన పాటలు కూడా కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. దాంతో తప్పకుండా సినిమా ఆకట్టుకుంటుందని విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. చైతూ కెరీర్‌లో ఇది మరో కమర్షియల్‌ సక్సెస్‌గా నిలుస్తుందని అంటున్నారు.

To Top

Send this to a friend