నా ఒక్కడి కష్టం కాదిది..

సాధారణంగా ఆడియో ఫంక్షన్లలో సొంత డబ్బా.. సినిమా అలా తీశాం.. ఇలా తీశామని చెబుతారు.. కానీ బాహుబలి2 ఆడియో ఫంక్షన్ మాత్రం మొత్తం ఎమోషన్లతో సాగింది. రాజమౌళి సినిమా ఎంత ప్లానింగ్ తో ఉంటుందో ఈ సభ కూడా అంతే గ్రాండ్ గా జరిగింది.
ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో రాజమౌళి ఉద్వేగానికి గురయ్యారు.  బాహుబలి తానొక్కడి కష్టం కాదని దిగ్గజ దర్శకుడు రాజమౌళి అన్నారు. ఈ సినిమా ఇంత బాగా రావడానికి వందల మంది కష్టం ఉందన్నారు. ఇప్పటివరకు చూసింది చాలా తక్కువ అని.. బాహుబలి2 లో ఇంకా చాలా ఉందన్నారు. ఇన్నేళ్లు బాహుబలికి ప్రభాస్ కు తాను ఏం ఇచ్చానని తాను బాధపడ్డానన్నారు. కానీ హిందీ ట్రైలర్ రిలీజ్ అప్పుడు ప్రభాస్ చూసి మీడియా, జనం చప్పట్లు కొడుతుంటే  గర్వంతో ఉప్పొంగానన్నారు. అంతే క్రేజ్ వచ్చిందని చూడగానే తాను ఇచ్చింది కరెక్టేనని అన్నారు..
రాజమౌళి స్పీచ్ లో మొత్తం యూనిట్ సభ్యుల కష్టం.. డ్యాన్స్, ఫైట్స్, గ్రాఫిక్స్, ఆఖరకు లైట్ బాయ్స్ వరకు అందరినీ పేరుపేరునా గుర్తు చేసి చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా తన వైఫ్ రమా రాజమౌళి తాను గర్వతో ఉప్పొంగినప్పుడల్లా తలమీద మొట్టికాయ వేసి నన్ను నేలమీదకు తీసుకొచ్చేదన్నారు.
అనంతరం మాట్లాడిన ప్రభాస్, రానా, అనుష్క, కట్టప్ప సత్యరాజ్, నాజర్ ఇలా అందరి మాటల్లో సినిమా పట్ల పెంచుకున్న బాంధవ్యం వారి మాటల్లో తొణికిసలాడింది.. కీరవాణి , రానా లు మాటలతో అలరించారు. కీరవాణి రాజమౌళి పై ఓ పాటను కంపోజ్ చేసినప్పుడు రాజమౌళి వేదికపై వచ్చి ఏడ్చేశారు. రాజమౌళి తన కూతుర్ని పట్టుకొని కొన్ని నిమిషాలు ఏడుస్తూ భావోద్వేగంతో అలానే పట్టుకొని కనిపించారు. మొత్తానికి బాహుబలి ఫంక్షన్ మిగతా అన్ని ఫంక్షన్లను మించి గ్రాండ్ గా జరిగింది. ఎవ్వరూ ఊహించని విదంగా యూట్యూబ్ లో సైతం లైవ్ వచ్చింది.
బాహుబలి ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఆడియో రిలీజ్ వేడుక వీడియోను కింద చూడొచ్చు..
To Top

Send this to a friend