నా ఫేవరెట్ హీరో హీరోయిన్లు


బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న జక్కన్న రాజమౌళికి నచ్చిన హీరో ప్రభాస్ అని అందరూ అనుకుంటారు.. కానీ కాదట.. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళియే చెప్పారు. బాహుబలి ప్రమోషన్ లో భాగంగా ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న రాజమౌళి.. అక్కడ విలేకరులు, అభిమానుల సమక్షంలో తన ఫేవరెట్ హీరోహీరోయిన్లు ఎవరో చెప్పేశాడు..

ఇప్పుడున్న హీరోహీరోయిన్లలో మీకు ఎవరంటే ఇష్టం అని విలేకరులు రాజమౌళిని అడగగా ఏమాత్రం తడుముకోకుండా.. తన ఫేవరెట్ హీరో జూనియర్ ఎన్టీఆర్ అని.. హీరోయిన్ అనుష్క అని చెప్పాడు. జూనియర్ ఎన్టీఆర్ … తనకు ఓ హీరోగానే కాదు.. మంచి మిత్రుడు కూడా అని చెప్పారు. ఇక అనుష్క నటనలో చూపే కమిట్ మెంట్ అద్భుతమని.. నటిగా ఆమె కష్టపడే తీరు చూసినప్పుడు డెడికేటెడ్ పర్సనాలిటీ ఇలా ఉంటుందని అనిపిస్తుందని రాజమౌళి చెప్పాడు.

కాగా ఏప్రిల్ 28న రిలీజ్ అయిన బాహుబలి ఆదివారం 1000 కోట్లు దాటింది. ఈ సందర్భంగా లండన్ లో ఉన్న రాజమౌళికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మరో వారం రోజుల్లో సినిమా 1500 కోట్ల కలెక్షన్ల దిశగా దూసుకుపోవడం ఖాయం అంటున్నారు సినీ క్రిటిక్స్.

To Top

Send this to a friend