ముందస్తు కలలు.. ‘పచ్చ’ వెతలు


టీడీపీ అధినేత , ఏపీ సీఎం చంద్రబాబు ముందస్తు ఎన్నికలు వస్తాయని చూచాయగా ప్రకటించడం ఏపీలో సంచలనంగా మారింది. ఈ ప్రకటన వెలువడిన మరుక్షణం ప్రతిపక్షాలన్నీ సమాయత్తమయ్యాయి. పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో సై అన్నారు. దూకుడుగా పార్టీ నిర్మాణం చేస్తున్నారు. మరో వైపు ప్రధాన ప్రతిపక్షం వైసీపీ కూడా వ్యూహరచనను వేగవంతం చేసింది. దేశంలోనే ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను వైసీపీ రాబోయే ఎన్నికల కోసం కోట్లు ఖర్చు పెట్టి తమ సలహాదారుగా నియమించుకుంటుంది. ఇలా చంద్రబాబు రేపిన ముందస్తు ఎన్నికల చిచ్చుతో ఏపీ లో రాజకీయ వేడి మొదలైంది..

ఈ సంచలన విషయంపై ఏపీ సీఎం కొడుకు, మంత్రి నారాలోకేష్ మాత్రం భిన్నంగా స్పందించారు. ముందస్తు ఎన్నికలు వస్తాయని చంద్రబాబు చెప్పలేదని.. కేవలం ఎన్నికలు ఎదుర్కోవడానికి మాత్రమే సిద్ధంగా ఉండాలని సూచించారని ప్లేట్ ఫిరాయించాడు. పైగా ఎన్నికలు ఎప్పుడొచ్చినా మాదే గెలుపు అంటూ ఘీంకరించారు. అంతవరకు బాగానే ఉంది కానీ గెలుపును లోకేష్ డిసైడ్ చేయడం కొంత వివాదం అయ్యింది.

ముందస్తు ఎన్నికల వేడి రాజుకోగానే వైసీపీ రియాక్ట్ అయిన తీరుతో ఏపీ సీఎం చంద్రబాబు, టీడీపీ నేతలు షాక్ తిన్నారు. వైసీపీ ఎన్నికల్లో గెలవడం కోసం దాదాపు 250 కోట్లు పెట్టి దేశంలోనే ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను నియమించుకుందన్న వార్త టీడీపీ శిభిరంలో గుబులు రేపుతోంది. అంతేకాదు జనసేన అధినేత పవన్ సైతం ఏపీలో గెలుపుకోసం పార్టీ నిర్మాణాన్ని వేగవంతం చేశారు. ఈ పరిణామాలన్నీ గమనించిన టీడీపీ శిబిరం ముందస్తుకు వెళితే పరిణామాలు ఎలా మారుతాయోనని భయపడుతున్నట్టు సమాచారం. అనవసరంగా ముందస్తుకు వెళ్లి సంవత్సరం అధికారాన్ని కోల్పోవద్దనే అభిప్రాయం టీడీపీలో వ్యక్తమవుతోందని తెలిసింది. అందుకే రాష్ట్రాల సమ్మతం లేకుండా ముందస్తు ఎన్నికలకు వెళ్లరని.. 2019లోనే ఎన్నికలను ఎదుర్కోంటామని లోకేష్ అనడం చూశాక.. టీడీపీ వెనకడుగు వేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

To Top

Send this to a friend