మునక్కాడతో ప్రయోజనాలెన్నో


మునక్కాడ తినడం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. వాడుక భాషలో మునక్కాడ లేదా ములక్కాడగా పిలువబడే డ్రంస్టిక్స్ ఆరోగ్యానికి విస్తృత ప్రయోజనాలను కలిగిస్తుంది. దీని వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ వివరించబడింది.

డ్రంస్టిక్స్, తెలుగులో “ములక్కాడ”గా పిలువబడే దీనిలో విలువైన మినరల్ మరియు ప్రోటీన్ లు ఉన్నాయి. వీటిని సాధారణంగా సాంబార్, ఇతర కూరగాయలు మరియు తృణధాన్యాలతో వంట తయారీలో వాడతారు. మంచి రుచితో పాటూ, ఆరోగ్యంగా ఉండటకు వీటిని వలన కలిగే ప్రయోజనాల గురించి తప్పక తెలుసుకోవలసిందే.

*బలమైన ఎముకలను నిర్మిస్తుంది
ములక్కాడలు ఉండే కాల్షియం ఐరన్, మరియు ఇతర కీలక విటమిన్ లను కలిగి ఉన్నందు వలన ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది. ములక్కాడ రసాన్ని లేదా పాలతో తీసుకోవటం వలన ఎముకల ఆరోగ్యం మేరుగుపడటమే కాకుండా, చిన్న పిల్లలలో ఎముకలు బలంగా మారతాయి.

*రక్తాన్ని శుభ్రపరుస్తుంది
ములక్కాడలు, రక్తాన్ని శుభ్రపరచటమే కాకుండా, బలమైన యాంటీ బయాటిక్ గుణాలను కలిగి ఉంటాయి. ఇలాంటి కూరగాయలను రోజు తినటం వలన మొటిమలు మరియు ఇతర చర్మ సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి.

*రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి
ములక్కాడ ఆకులు రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించి, మధుమేహ వ్యాధిని తగ్గిస్తాయి. ములక్కాడలను తినటం వలన సూప్ లేదా జ్యూస్ లో కలుపుకొని, తాగటం వలన పిత్తాశయం విధి సరిగా నిర్వహించేలా ప్రోత్సహించి, చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి.

* గర్భసమస్యలను తగ్గిస్తుంది
గర్భ సమయంలో ములక్కాడలను తినటం వలన ప్రసవం ముందు మరియు తరువాత కలిగే సమస్యలను తగ్గిస్తుంది. అధిక స్థాయిలో విటమిన్ మరియు మినరల్ ను కలిగి ఉండే ఈ రకం కూరగాయలు గర్భాశయం యొక్క నిదానించడం వంటి సమస్యలను తగ్గించి, ప్రసవం తరువాత పాల ఉత్పత్తిని పెంచుతుంది.

* జీర్ణ వ్యవస్థలో మెరుగుదల
ములక్కాడలు మరియు వాటి ఆకులు సంక్లిష్ట విటమిన్ ‘B’ లను కలిగి ఉండి, జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ విటమిన్ లు జీర్ణ వ్యవస్థను నియంత్రించి, సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను, ప్రోటీన్ మరియు కొవ్వు పదార్థాలను విచ్చిన్న పరుస్తాయి.

* లైంగిక సామర్థ్యాన్ని పెంచుతాయి..
ములక్కాడలో మంచి మోతాదులో జింక్ ఉండటం వలన శుక్రకణాల (స్పెర్మాటోజెనెసిస్) ఉత్పత్తిని పెంచి, పురుషులలో లైంగిక శక్తిని పెంచుతుంది. ముదురు రంగులో ఉండే ఈ చెట్లలో ఉండే సమ్మేళనాలు నపుంసకత్వాన్ని, అకాల స్ఖలనం మరియు పలుచటి వీర్యం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

To Top

Send this to a friend