నిజమైన ప్రేమికుడంటే ఇతడే..

యాసిడ్ తో ముఖమంతా కాలిపోయింది. దాదాపు 17 సర్జరీల తర్వాత గానీ ఆమెకు ఒక రూపు రాలేదు. అయినా ఆ మచ్చలు , ముఖం ఎత్తుపల్లాలు అలానే ఉన్నాయి. కొంచెం అందంగా లేకున్నా తిరస్కరించే పెళ్లికొడుకులు ఉన్న ఈరోజుల్లో కూడా  ముంబైలో సిసీ టీవీ ఆపరేటర్ గా పనిచేస్తున్న రవి శంకర్ అనే యువకుడు తనది నిజమైన ప్రేమ అని నిరూపించాడు. యాసిడ్ దాడి బాధితురాలిని పెళ్లి చేసుకొని అందరిచేత ప్రశంసలు పొందాడు.

థానెకు చెందిన లలితపై ఏదో గొడవలో ఆమె సోదరుడే యాసిడ్ దాడి చేశాడు. ముఖం మొత్తం కాలిపోయిన ఆమె స్వస్థలం యూపీలోని అజంగఢ్ లో ఉండలేక ముంబై శివారు కల్వా థానేలోని సాహస్ ఫౌండేషన్ లో చేరింది. అక్కడ అందరూ యాసిడ్ దాడి బాధితులే ఉంటున్నారు.

ఈ నేపథ్యంలోనే లలితకు, రవిశంకర్ కు మిస్ డ్ కాల్ ద్వారా పరిచయం ప్రేమగా మారింది. ఓ రోజు శంకర్ పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. తన రూపు, యసిడ్ దాడి గురించి బాధితురాలు వివరించింది. అయినా శంకర్ ప్రేమకు అందంగా అక్కర్లేదని పెళ్లి ఒప్పుకొని చేసుకున్నాడు. ‘అద్భుతాలు జరుగుతాయనే మాట నా జీవితంలో రుజువైంది’ పెళ్లి తర్వాత లలిత ఏడ్చేయడం అందరినీ కలిచివేసింది.  ఈ వార్త అన్నీ జాతీయ చానళ్లు, మీడియాలో వచ్చాయి. శంకర్ ను అందరూ పొగిడేశారు.

To Top

Send this to a friend