ముఖేష్ అంబానీ అయితే నాకేంటి.?

దాదాపు 600 మంది సిబ్బంది పర్యవేక్షణ.. ఎప్పుడూ ఫుల్ సెక్యూరిటీ ఉండే దేశంలోనే నంబర్ 1 కోటీశ్వరుడి బంగ్లా అది.. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నివసిస్తున్న ముంబైలోని అంటానీయా భవనంలో నిన్న రాత్రి ఒక్కసారిగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఆరో ఫ్లోర్ లో రాత్రి 9 గంటలకు మంటలు లేచాయి. సమాచారం అందుకున్న ఆరు అగ్ని మాపక యంత్రాలు రంగంలోకి దిగి మంటలను ఆర్పివేశాయి..

ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన భవానాన్ని ముఖేష్ ఏరీకోరి భార్య, పిల్లల కోసం నిర్మించుకున్నారు. దీనికోసం దాదాపు 12,500 కోట్లు ఖర్చు పెట్టాడు. మొత్తం బుల్లెట్ ఫ్రూవ్ గ్లాస్, గోడలనే నిర్మించేశాడు. ఈ 27 అంతస్థుల అంటిలియా భవనంలో ముఖేష్ ప్రస్తుతం నివసిస్తున్నారు. ఇందులో థియేటర్లు, స్టూడియోలు, జిమ్ లు, స్విమ్మింగ్ ఫూల్ లు, శ్రీకృష్ణ మందిరం, మూడు హెలీప్యాడ్ లున్నాయట.. ఇందులో పార్కింగ్, గ్యారేజీ కోసమే ఆరు అంతస్థుల్లో నాలుగు లక్షల చదరపు అడుగుల స్థలాన్ని కేటాయించాడంటే ఈ కోటీశ్వరుడి స్టామినా అర్థం చేసుకోవచ్చు..

అయితే అంతా బాగానే కట్టినా భవనానికి వాస్తు దోషం ఉందని అప్పట్లోనే పండితులు ముఖేష్ కు చెప్పారట. అన్ని వేల కోట్లు పెట్టి వాస్తు చూసుకోకుండా కట్టిన అంబానీకి అప్పుడే కష్టాలు వస్తాయని పండితులు చెప్పారట.. వాస్తు దోషం ఉంటే అగ్ని, నీరు, వాయుతో పాటు ఆస్తి నష్టం వాటిల్లుతుందని పండితులు చెబితే ముఖేష్ పెడచెవిన పెట్టాడట. ఇప్పుడు ప్రమాదం జరగడంతో పునరాలోచనలో పడిపోయాడని సమాచారం… వాస్తు పండితులు చెప్పిందే ఇప్పుడు నిజమై నిన్న రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ఎప్పుడూ సెంటిమెంట్ ను నమ్మని ముఖేష్ ఇప్పుడు వాస్తు పండితుల వాదనతో పునరాలోచనలో పడిపోయినట్టు సమాచారం.

To Top

Send this to a friend