మాజీ కెప్టెన్ ‘కూల్’ అనిపించుకున్నాడు..

మహేంద్ర సింగ్ ధోని.. కెప్టెన్ కూల్ గా పేరుతెచ్చుకున్నాడు. భారత్ అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ప్రపంచకప్ ను సాధించిన పెట్టిన ఘనుడు ఆయన.. ప్రశాంతతకు మారుపేరుగా ఉండే ధోని ప్రపంచకప్ ఫైనల్ లోనే చివరి బంతికి సిక్స్ కొట్టి కప్ సొంతమైనా తన సహజ ధోరణిలోనే ప్రశాంతంగా కర్మయోగిలా ఉండిపోయాడు. అందరూ ఏడ్చినా ధోని లో ఏ ఎమోషన్ రాలేదు.

అలాంటి ధోని శ్రీలంకతో మ్యాచ్ లోనూ అదే పరిణతి చూపించాడు. తమ జట్టు ఓటమి అంచున నిలబడడంతో చిర్రెత్తుకొచ్చిన శ్రీలంక ప్రేక్షకులు స్టేడియంలో భీభత్సం సృష్టించడంతో ఎంపైర్లు ఆటను ఆపేసారు. క్రికెటర్లు పెవిలియన్ కు పోకుండా స్టేడియంలోనే ఓ చోట గుమిగూడి ప్రేక్షకుల రావణ కాష్టంను చూస్తున్నారు. మన ధోని మాత్రం పిచ్ పై పడుకొని శ్రీలంక ప్రేక్షకుల ఆందోళనను పట్టించుకోకుండా కునుకు తీయడం విశేషం. దీనిపై అంపైర్లు, కామెంటర్లు, ధోని ప్రశాంతతపై వేయినోళ్ల పొగిడారు. ఇంత కూల్ మనిషిని ఎక్కడా చూడలేదని అందరూ ప్రశంసిస్తున్నారు.

మూడో వన్డేలో కూడా రోహిత్, ధోని బ్యాంటింగ్ లో 150కిపైగా భాగస్వామ్యం చేసి మ్యాచ్ ను గెలుపు దిశగా నడిపిస్తున్నారు. ఇంతలోనే మరో 8 పరుగులు చేస్తే ఇండియా గెలుస్తుందనగా.. మ్యాచ్ ఆగిపోయింది. కలకలం మొదలైంది. పిచ్ పై బ్యాటింగ్ లో ఉన్న మాజీ కెప్టెన్ ధోని అక్కడే కింద పడుకుండిపోయాడు. కునుకు తీశాడు. చుట్టూ స్టేడియం అంతా మర్మోగిపోతోంది.శ్రీలంక ప్రేక్షకులు బాటిల్స్, కుర్చీలు, ఏది దొరికితే అది విసురుతూ స్టేడియంలోకి పడేస్తూ భీభత్సం చేస్తున్నారు. ఇంత గొడవలో ధోని స్టేడియంలోని పిచ్ పై ప్రశాంతంగా పడుకోవడం గమనార్హం.

To Top

Send this to a friend