దారుణం : మహానటి కోసం చీప్‌ పబ్లిసిటీ

ప్రముఖ తెలుగు హీరోయిన్‌ సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ‘మహానటి’ అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. అశ్వినీదత్‌ నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతుంది. భారీ అంచనాలున్న ఈ సినిమా స్క్రిప్ట్‌ కోసం దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ దాదాపు రెండు సంవత్సరాల పాటు కష్టపడి పలు రీసెర్చ్‌లు చేసి, ఎంతో మందిని కలిసి మాట్లాడి అప్పుడు స్క్రిప్ట్‌ను పూర్తి చేశాడు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఈ సినిమా షూటింగ్‌ కార్యక్రమాలు తాజాగా మొదలు అయ్యాయి. హైదరాబాద్‌లోని రామకృష్ణ స్టూడియోలో మొదటి షెడ్యూల్‌ను ప్రారంభించారు.

మొదటి షెడ్యూల్‌ మొదటి రెండు రోజుల్లోనే సినిమాకు అతి కీలకమైన సావిత్రి పాత్ర పోషిస్తున్న కీర్తి సురేష్‌ లుక్‌తో పాటు మరో ముఖ్య పాత్రలో నటిస్తున్న సమంత లుక్‌ కూడా లీక్‌ అయ్యింది. వీరిద్దరు సినిమాకు చాలా కీలకం. అలాంటి వీరిద్దరి లుక్‌ లీక్‌ కావడం కావడం వల్ల సినిమాపై ప్రభావం పడే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు. నేడు హీరోయిన్స్‌ లుక్‌ రివీల్‌ అవ్వగా, తర్వాత తర్వాత మరేం లీక్‌ అవుతాయో కాస్త దర్శకుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

మరో వైపు చిత్ర యూనిట్‌ సభ్యులు కావాలనే సమంత మరియు కీర్తి సురేష్‌ల లుక్‌లను రివీల్‌ చేశారా, సినిమాపై ఆసక్తిని పెంచేందుకు ఇలా చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మహానటి కోసం చీప్‌ పబ్లిసిటీని దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఆశ్రయిస్తున్నాడా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది.

To Top

Send this to a friend