మోటోరోలా సంచలనం


భారత్ లో ఎక్కువశాతం మొబైల్ కొనుగోళ్లు 5-10వేల లోపు మాత్రమే ఉంటున్నాయి. అందుకే ఈ మార్కెట్ ను సొంతం చేసుకునేందుకు చైనా మొబైల్ కంపెనీలు, సామ్ సంగ్, మోటోరోలా లాంటి దిగ్గజ కంపెనీలు సైతం ఆ శ్రేణిలో మొబైళ్లను విడుదల చేస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి.

ప్రస్తుతం ప్రపంచంలోనే మొబైళ్ల అమ్మకాల్లో మొదటి స్థానంలో ఉన్న సామ్ సంగ్ భారత మార్కెట్లో 5000 లోపు ఫోన్లను ప్రవేశపెట్టి వినియోగదారుల ఆదరణను చూరగొంది. సామ్ సంగ్ కు పోటీగా అమెరికన్ టెక్నాలజీ దిగ్గజ సంస్థలు యాపిల్, మోటోరోలా బరిలో ఉన్నాయి. యాపిల్ ఫోన్లు ఎలాగూ సామాన్యులకు అందనంత ఎత్తులో ఉంటాయి. ఇక మోటోరోలా మాత్రం ఇప్పుడు సామాన్యులకు అందుబాటు ధరల్లో ఫోన్లను తీసుకొచ్చింది.

భారత్ బడా మార్కెట్. దాదాపు 120 కోట్ల మంది జనం.. ఎంతలేదన్నా కనీసం 50 నుంచి 70 కోట్ల మంది మొబైళ్లు వాడతారు. అందుకే ఇలాంటి వర్ధమాన దేశాల్లో విస్తరించాలని వ్యూహాలు సిద్దం చేసిన మోటోరోలా వినియోగదారులను ఆకట్టుకునేందుకు చీప్ ఫోన్ ను విడుదల చేసింది.. తక్కువ ధరలో మోటో సీ ప్లస్ ను తీసుకొచ్చింది. దీని ధర రూ.6999. అంతకుముందే మోటో సీని కూడా విడుదల చేసింది. దీని ధర రూ.5999.మోటో విక్రయిస్తున్న అన్ని ఫోన్లలో ఇదే తక్కువ ధరది.. ఫీచర్లు కూడా బాగున్నాయి..చార్జింగ్ సమస్యలు లేకుండా ఈ ఫోన్లలో ఏకంగా 4000ఎంఏహెచ్ బ్యాటరీని మోటో కంపెనీ పెట్టడం గమనార్హం.

మోటో సీ ప్లస్ ఫీచర్లు అద్భుతంగా ఉన్నాయి.. 5 ఇంచుల డిస్ ప్లే తో పెద్ద స్క్కీన్ ఇచ్చారు. 2జీబీ ర్యామ్, 16జీబీ ఇన్ బిల్ట్ మెమొరీతో స్పీడ్ తో పాటు మెమొరీని జతపర్చారు. 1.3 గిగాహెర్జ్ ప్రాసెసర్ వేగాన్ని జోడించారు.. చార్జింగ్ సమస్యలు లేకుండా 4000బ్యాటరీ జోడించడం విశేషం. 8ఎంపీ రియర్, 2 ఎంపీ ఫ్రంట్ కెమెరాను దీనికి అనుసంధానించారు.

To Top

Send this to a friend