చీప్ ఫోన్ విడుదల చేస్తున్న మోటో


బంగారు బాతులా మారిన భారతీయ మొబైల్ పరిశ్రమను అందిపుచ్చుకోవడానికి వివిధ దిగ్గజ మొబైల్ కంపెనీలన్నీ విరివిగా తమ ఉత్పత్తులను విడుదల చేస్తున్నాయి. ప్రస్తుతం తక్కువ ధరకు, ఎక్కువ ఫీచర్లతో మార్కెట్లో ప్రవేశపెట్టిన జియోమీ రెడ్ మీ ఫోన్లకు విపరీతమైన గిరాకీ నెలకొంది. రెడ్ 4ఏ ఫోన్ 6వేలకే అద్భుత ఫీచర్లతో సామాన్యులను ఊరిస్తోంది. కానీ ఈ ఫోన్ సరిపడా స్టాక్ లేకపోవడం తో వినియోగదారులు అడ్వాన్స్ బుకింగ్ లు చేసుకుంటున్నారు..

జియోమీ రెడ్ మీ ఫోన్లకు వస్తున్న డిమాండ్ ను అందిపుచ్చుకోవడానికి ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ మోటో రంగంలోకి దిగింది. త్వరలోనే 8వేలలోపు రెండు ఫోన్లను జూన్ లో భారత్ లో లాంచ్ చేయనున్నట్టు ప్రకటించింది. జియోమీ రెడ్ మీ ఫోన్లకు పోటీగా మోటో ఈ బడ్జెట్ ఫోన్ ను లాంచ్ చేస్తున్నట్టు మార్కెట్ వర్గాలు ప్రకటించాయి.

కొత్తగా మోటో విడుదల చేసే బడ్జెట్ ఫోన్లకు మోటో సీ, మోటో సీ ప్లస్ అని పేర్లు పెట్టారు. మోటో సీకు 1జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ ఉండగా.. మోటో సీ ప్లస్ కు 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ఇచ్చారు. రెండింటికి 8 ఎంపీ కెమెరాలు ఉన్నాయి. బ్యాటరీ 3800 ఎంఏహెచ్ సామర్థ్యం ఉన్నవి పెట్టారని టెక్ వర్గాలు తెలుపుతున్నాయి.

To Top

Send this to a friend