సెల్ఫీలకే అమ్మ.. పోషణకు కాదు..

 

నదులు ఇంకినా ఇంకిపోనిది అమ్మ ప్రేమే.. తనకంట కన్నీరు దాచుకొని బిడ్డ బతుకున పన్నీరు నింపేది అమ్మ.. సమాజంలో, మనుషుల్లో వచ్చిన మార్పు అమ్మ ప్రేమను దూరం చేస్తోంది. ఉమ్మడి కుటుంబాలు పోయి చిన్న కుటుంబాలు రావడంతో ఎవరి బతుకు వాళ్లదవుతోంది. 20ఏళ్లు కనిపెంచిన అమ్మలను మలివయసులో కొడుకులు కాలదన్నుతున్నారు. వారి ఆలనా పాలన చూసుకోకపోవడంతో ముసలి తల్లులు రోడ్డున పడుతున్నారు. అధికారులను శరణు వేడుతున్నారు. మీడియా పతాక శీర్షికల్లో ఎక్కుతున్నారు.

అమ్మలను కాలదన్నుతున్న కొడుకులు, కూతుళ్ల ఉదంతాలు నేటి సమాజంలో ఎన్నో చోటు చేసుకుంటున్నాయి. మాతృదినోత్సవ సందర్భంగా అమ్మల ఫొటోలతో అందరూ సోషల్ మీడియా ఫేస్ బుక్, వాట్సాప్ లలో హల్ చల్ చేస్తున్నారు. ఫేస్ బుక్ పుణ్యమా అని చాలా మందికి అమ్మ గుర్తు వస్తున్నది.. ఈరోజు మాతృదినోత్సవం అని అమ్మను ఫేస్ బుక్కుల్లో కాదు.. గుండెల్లో నిలుపుకుంటే మంచిది. కాశీకి పంపకున్నా కాటికి పంపకుంటే చాలు.. సరే ఇంట్లోనే బాగా చూసుకోండి.. కళ్ల ముందుంచుకొని కడుపుకింత పెడితే చాలు.. జనం లైక్ ల కంటే జన్మనిచ్చిన వారి కళ్లల్లో వెలుగులు నింపితే ఈ మాతృదినోత్సవానికి సార్ధకత..

 

To Top

Send this to a friend