లైట్ ఉంటే దోమలు కుట్టవట..


రాత్రి పడుకునే ముందు అందరూ లైట్లను ఆర్పివేస్తారు.. పడుకుంటారు.. మన పని మనం చేస్తే దోమలు మాత్రం వాటి పని అవి చేస్తాయి. మనుషుల రక్తం పీలుస్తాయి. చిన్నపిల్లలు, వృద్ధులకైతే అంతగా స్రృహ ఉండదు. వారిని దోమలు బాగా చికాకు పెడతాయి.. దోమలు ముఖ్యంగా సాయంత్రం వేళల్లో, తెల్లవారు జామున ఎక్కువగా కాట్లు వేస్తాయి.

అయితే అమెరికాలోని నోట్రెడామ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు దోమలపై చేసిన పరిశోధన వాటిని అరికట్టడంతో ఎలా విజయం సాధించవచ్చో నిరూపించింది. వెలుతురు ఉంటే దోమలు అంతగా కుట్టవని.. అందుకే పగలు దోమలు తీవ్రత తక్కువగా ఉంటుందని తెలిపారు..

పరిశోధనలో భాగంగా కొన్ని దోమలను చీకట్లో, మరికొన్ని దోమలను వెలుతురులో ఉంచారు. చీకట్లో ఉన్న దోమలు మనుషుల రక్తం తాగే పనిలో బిజీగా ఉండగా.. వెలుతురు లో ఉన్న దోమలు ఆ పనిచేయలేదు. దీంతో వెలుతురు ఉంటే దోమలు కుట్టవని పరిశోధనల్లో తేలింది. మలేరియా, డెంగ్యూ సహా ఎన్నో ప్రాణాంతక రోగాల వ్యాప్తిని అరికట్టడంతో ఈ పరిశోధన మేలు చేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

To Top

Send this to a friend