లక్షల ఎస్.బీ.ఐ ఏటీఏం కార్డుల రద్దు..

ఆన్ లైన్ మోసాలు ఎక్కువైపోతున్నాయి. ఏటీఎం కార్డులు భద్రంగా ఉండడం లేదు. దీంతో ఆర్బీఐ రంగంలోకి దిగింది. భద్రతా కారణాల దృష్ట్యా మాగ్నటిక్ స్క్రిప్ట్ డెబిట్ కార్డులను రద్దు చేయమని కోరింది. వాటి స్థానంలో ఈవీఎం చిప్ డెబిట్ కార్డులతో భర్తీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే కొంత మంది ఎస్బీఐ ఖాతాదారులకు డెబిట్ కార్డు బ్లాక్ చేశామని.. చిప్ లు ఉన్న ఏటీఎంలను తీసుకోవాలని మెసేజ్ లు కూడా ఎస్.బీ.ఐ పంపింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30లోగా అన్ని బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు చిప్ ఆధారిత ఏటీఎం మోడల్స్ లోకి మారాలని సూచించింది. రద్దు అయిన కార్డులను మార్చుకోవడానికి ఖాతాదారులు బ్యాంకులను సంప్రదించాలని తెలిపింది.

ఈ మధ్య దేశవ్యాప్తంగా ఏటీఎం కార్డులతో నంబర్లు తెలుసుకొని మోసం చేసి డబ్బులను కొందరు మోసగాళ్లు కొల్లగొడుతున్నారు. అందుకే తక్షణమే బ్యాంకులన్నీ అత్యధిక ఫీచర్లు గల చిప్ సెట్ ఉన్న ఏటీఏంలను ఖాతాదారులకు ఇవ్వాలని సూచించింది. ఆన్ లైన్ ద్వారా కూడా కార్డులు మార్చుకునే సౌకర్యాన్ని కల్పించినట్లు ఎస్.బీ.ఐ తన ఖాతాదారులకు పేర్కొంది.

ప్రస్తుతం ఉన్న పాత ఏటీఎంలను బ్యాంకులో తీసుకొని ఈ ఈవీఎం చిప్ సెట్ ఉన్న డెబిట్ కార్డులను ఉచితంగా బ్యాంకు అందజేయనుంది. కొత్తగా అందించే చిప్ ఆధారిత డెబిట్ కార్డులో ఖాతాదారుల పూర్తి సమాచారం. కోడింగ్ రూపంలో ఉండడమే కాదు అదనపు భద్రత కూడా ఉంటుంది. ఇది ప్రపంచ ప్రమానాలు కలిగిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించబడిందట.. సో ఇప్పటికైనా మీ పాత ఏటీఎం కార్డులను మార్చుకొని చిప్ ఆధారిత ఏటీఎంలను పొందండి..

To Top

Send this to a friend