మూడో బాహుబలి.?


బాహుబలి తో విశ్వవిఖ్యాత దర్శకుడిగా ఎదిగిపోయిన రాజమౌళి కథ, కథనం చెప్పడంలో ప్రపంచంలో మేటి అని ఇటీవల బాలీవుడ్ దర్శక నిర్మాత కరుణ్ జోహర్ చెప్పారు. అంతా బాగా స్క్రీన్ ప్లే చేస్తాడు రాజమౌళి.. బాహుబలి2 కన్ క్లూజన్ లో ఎమోషన్ ను అద్భుతంగా తెరకెక్కించాడని టాక్. సెన్సార్ కు వెళ్లినప్పుడు చూసిన సభ్యులు ఇదే విషయాన్ని రివీల్ చేశారు.

అయితే తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో చెప్పలేదు కానీ.. బాహుబలి2 సినిమాలో ముగ్గురు బాహుబలిలు ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ వార్త నిజమో కాదో తెలియదు కానీ విస్తృతంగా వ్యాపిస్తోంది.. ఈ వార్త ప్రకారం ప్రభాస్ బాహుబలి2లో మూడు పాత్రల్లో కనిపించనున్నారట.. అది శివుడు, అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి అట.. అయితే శివుడే మహేంద్ర బాహుబలి అనే విషయం మొదటి బాహుబలిలోనే స్పష్టం తెలిసినా.. కూడా ఇందులో మహేంద్ర బాహుబలి అనేది మూడో పాత్రగా చూపించారని టాక్ వినిపిస్తోంది. అయితే ఏప్రిల్ 28 వరకు సినిమాలో కథేంటి అనే విషయం ఎవ్వరికీ తెలీదు..

కాగా బాహుబలి2 బిజినెస్ బాగా జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే హాలీవుడ్ సినిమాలకంటే కూడా బాహుబలి2 సినిమా ఎక్కువ స్క్రీన్లలో ప్రదర్శితం అవుతోందట.. ఈ చిత్రాన్ని మన దేశంలో 6500 స్ర్కీన్లపై ప్రదర్శిస్తున్నారు. ఇక అమెరికా కెడాల్లో కూడా దాదాపు 1005 తెరలపై వేస్తున్నారట.. ఇప్పటివరకు ఏ హాలీవుడ్ సినిమా కూడా ఇన్ని తెరలపై విడుదల కాలేదని.. ఇదే హైయెస్ట్  అని బాహుబలి నిర్మాతలు చెబుతున్నారు.

To Top

Send this to a friend