ఎస్.బీ.ఐ ఖాతాదారులందరికీ ఇదో ఓ హెచ్చరిక.. వారి ఖాతాల్లోని డబ్బులు మాయమైపోతున్నాయట.. ఎలాంటి ఓటీపీ రాకుండానే… మెసేజ్ లు రాకుండానే డబ్బులు మాయమవుతున్నట్టు బ్యాంకులకు ఫిర్యాదు అందుతున్నాయి. ఇలా చాలా మందికి మెసేజ్ లు రావడంతో ఖాతాదారులు బ్యాంకులను ఆశ్రయించి ఫిర్యాదు చేస్తున్నారు. రెండు వారాలుగా ఎస్.బీ.ఐ ఖాతాదారుల నుంచి భారీగా సొమ్ము కాజేస్తున్నారు. ఎస్.బీ.ఐ క్రెడిట్, డెబిట్ కార్డులతో పాటు.. నెట్ బ్యాంకింగ్ లలో భారీగా సొమ్ములు పోగొట్టుకున్నవారు గగ్గోలు పెడుతున్నారు. దీనికంతటికి ఎస్.బీ.ఐ సాఫ్ట్ వేర్ పై మాల్ వేర్ దాడియే కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ముఖ్యంగా ఉబెర్, ఓలా క్యాబ్ లతోపాటు అమెజాన్ వంటి సైట్లలో ఆన్ లైన్ చెల్లింపులు చేసేవారు అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రమాదకరమైన మాల్ వేర్ కారణంగానే ఈ మోసాలు జరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. నెట్ బ్యాంకింగ్ పాస్ వర్డ్ లు సైతం పనిచేయకుండా పోతున్నాయని.. వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని రోజుకు మూడు నాలుగు సార్లు ఖాతాలో సొమ్ము సరిచూసుకోవాలని సైబర్ నిపుణులు, బ్యాంక్ అధికారులు సూచిస్తున్నారు.
