రాజుగారి పంట పండినట్లే..!


మెగా హీరో అల్లు అర్జున్‌, పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన చిత్రం ‘డీజే’. ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించిన విషయం తెల్సిందే. ఈ చిత్రం దిల్‌రాజుకు 25వ చిత్రం. దాంతో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించాడు. బన్నీ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించినట్లుగా మొదటి నుండి ప్రచారం జరుగుతుంది. దాదాపుగా 50 కోట్లను అల్లు అర్జున్‌పై దిల్‌రాజు పెట్టినట్లుగా వార్తలు వచ్చాయి.

ఇప్పటి వరకు రెండు మూడు సినిమాలు మాత్రమే బన్నీ కెరీర్‌లో 50 కోట్ల చిత్రాలుగా నిలిచాయి. అలాంటి బన్నీపై 50 కోట్ల బడ్జెట్‌ పెట్టడం అంటే సాహసమే అని దిల్‌రాజును ఉద్దేశించి అంతా అనుకున్నారు. అయితే దిల్‌రాజు ఏం చేసినా కూడా అందులో మ్యాటర్‌ ఉంటుంది. ప్రతి పైసాను లెక్క కట్టి పెట్టే నిర్మాత దిల్‌రాజు అనుకున్నట్లుగానే ‘డీజే’పై విడుదలకు ముందే భారీ లాభాలను సొంతం చేసుకున్నాడు.

చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం అన్ని ఏరియాల థియేట్రికల్‌ రైట్స్‌తో పాటు ఆడియో, శాటిలైట్‌, ఇతర రైట్స్‌ మొత్తం కలిపి 75 కోట్ల వరకు వచ్చినట్లుగా తెలుస్తోంది. విడుదలకు ముందే నిర్మాత దిల్‌రాజుకు 25 కోట్ల లాభం వచ్చింది. ఇక సినిమా విడుదల తర్వాత సూపర్‌ హిట్‌ అయితే ఈ లాభం మరింత పెరిగే అవకాశం ఉంది. మొత్తానికి దిల్‌రాజుకు ‘డీజే’ చిత్రంతో పంట పండటం ఖాయంగా ట్రేడ్‌ వర్గాల వారు చెబుతున్నారు.

To Top

Send this to a friend