తొక్కలో రూల్స్.. ముమైత్ రీఎంట్రీ..

తొక్కలో రూల్స్.. మేం ఆడిందే ఆట.. మేం చూపించిందే షో అంటూ స్టార్ మాటీవీ యాజమాన్యం వ్యవహరిస్తోంది. షో మొదలైనప్పుడు ఎన్టీఆర్ చెప్పిన నిబంధనలను నిర్వాహకులు మార్చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో భాషల్లో బిగ్ బాస్ ప్రోగ్రాములు నడుస్తున్నాయి. కానీ ఎక్కడా లేనిది తెలుగు బిగ్ బాస్ షో వింతగా, కొత్తగా నడుస్తోంది.

తెలుగు షోలో నిబంధనలకు నీళ్లొదిలేశారు.. తెలుగు స్క్రిప్ట్, ప్లానింగ్, ప్రజంటేషన్ లోపం స్పష్టం కనిపిస్తోంది. ఇక సెలబ్రెటీలకు టాస్క్ ల పేరిట ఇస్తున్న పందేలు ఏమాత్రం ఆకట్టుకోవడం లేదు. ఇక తమిళనాడులో అయితే కమల్ హాసన్ హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ షో అట్టర్ ప్లాప్ టాక్ తెచ్చుకుంది. కొంతలో కొంత మన ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న కాస్త నిలదొక్కుకుంది.

ఒక కంటెస్టెంట్ కోసం బిగ్ బాస్ రూల్స్ మారిపోవడం.. బయటకు తీసుకెళ్లి మళ్లీ రప్పించడం అనే బిగ్ బాస్ చరిత్రలోనే లేదట.. ఇలా తెలుగు బిగ్ బాస్ షోలోనే ఈ సంచలనం నమోదైంది. ముమైత్ ఖాన్ ఆ ఘనత వహించింది. మొత్తానికి తెలుగు షో లో రూల్స్ ను గంగలో కలిపేశారు నిర్వాహకులు.. మొదటగా ఎన్టీఆర్ తో పాటు బిగ్ బాస్ ఏమని చెప్పాడు. ఒక్కసారి ఇంట్లోకి వెళ్లాక బయటకు రావడం కుదరదన్నారు. అన్నీ తాళాలు వేసేసి వారానికి ఒకరిని చొప్పున ఎలిమినేషన్ చేస్తామన్నారు. కానీ ఆ రూల్స్ ఎక్కడా కనిపించడం లేదు. పోయిన వారం ఈ షోలో ఉండలేనని బీభత్సం చేసిన సంపూను బయటకు పంపించేశారు. ఇప్పుడు డ్రగ్స్ కేసులో ఇరుక్కుందని తెలిసి నిబంధనలకు విరుద్ధంగా ముమైత్ ఖాన్ ను ఒక్కరోజు బిగ్ బాస్ హౌస్ నుంచి పంపించేశారు. మళ్లీ నిన్న రాత్రి 2 గంటలకు ఆశ్చర్యకరంగా ముమైత్ ఖాన్ ను తిరిగి బిగ్ బాస్ హౌస్ లోకి చొప్పించారు.

To Top

Send this to a friend