ముమైత్ సేవలు.. బిగ్ బాస్ లో వివాదాస్పదం..

బిగ్ బాస్ లో ముమైత్ ఖాన్ రెచ్చిపోయింది. బిగ్ బాస్ ఇచ్చిన అడ్వంటేజ్ ను ఆసరాగా చేసుకొని ఇంటిలోని మిగతా సెలబ్రెటీలతో ఓ ఆట ఆడుకుంటోంది. ముమైత్ వారితో చేయకూడని పనులు చేయిస్తోంది. టాయిలెట్స్ కు వెళ్లకుండా ఆడవాళ్లను బయట గడ్డిలో పడుకోమంటోంది. మగవాళ్లు అయిన ధన్ రాజ్, నవదీప్, ఆదర్ష్, ప్రిన్స్ లను కేవలం 20 నిమిషాల్లో స్నానం చేసి బట్టలిప్పేసి డ్రాయర్ పై ఉండమని ఆదేశించింది.

అంతేకాదు.. వారి శరీరానికి నల్లరంగు పూసి వంటలు చేయించడం.. వారితో సపర్యాలు సైతం చేయించుకుంది.. పలు గేమ్ లను పెట్టి ఆనందిస్తూ ముమైత్ మిగతా ఇంటి సభ్యులను ముప్పుతిప్పలు పెడుతోంది. బట్టలు లేకుండా పనిమనుషులుగా ముమైత్ చెప్పినట్టు చేస్తూ మగ సెలబ్రెటీలు అష్టకష్టాలు పడుతున్నారు. పైగా మధ్యలో టాస్క్ లు ఆడుతున్నారు…

బిగ్ బాస్ ఇంటిలో బుధవారం దొంగలు పడి సెలబ్రెటీల బట్టలు, వస్తువులు, ఆహార పదార్థాలు దోచుకెళ్లిన సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే దొంగలు దోచుకుపోయిన వారి సమాన్లను సెలబ్రెటీలందరూ తిరిగి పొందాలన్నా.. ఇంట్లో ఉండాలన్న ముమైత్ చెప్పినట్టు చేయాల్సిందేనని బిగ్ బాస్ ఆదేశించారు. దీంతో సెలబ్రెటీలందరూ ఇప్పుడు ముమైత్ చెప్పినట్టు కిక్కురుమనకుండా చేసేస్తున్నారు.

To Top

Send this to a friend