బిగ్ బాస్ లోకి దొంగల ముఠా నాయకురాలు..

బిగ్ బాస్ లో గడిచిన ఆదివారం ఎలిమినేట్ అయింది సెలబ్రెటీ ముమైత్ ఖాన్. ఆమెను ఎలిమినేట్ చేయకుండా బిగ్ బాస్ ఓ సీక్రెట్ రూంలో ఉంచిన సంగతి తెలిసిందే.. ఆ సీక్రెట్ రూంలో ఉంచి సెలబ్రెటీలకు ముమైత్ పేరు చెప్పి టాస్క్ లు ఇచ్చిన బిగ్ బాస్.. ముమైత్ పై ఉన్న కోపాన్ని అంతా సెలబ్రెటీలు ఈ మూడు రోజుల్లో కక్కేలా చేశాడు. సెలబ్రెటీలు తనపై చేసిన వ్యాఖ్యలపై ప్రతీకారంతో రగిలిపోతున్న ముమైత్ ను బుధవారం రాత్రి బిగ్ బాస్ ఇంట్లోకి పంపిస్తున్నట్టు బిగ్ బాస్ ప్రోమో విడుదలైంది.

ముమైత్ ను దొంగల ముఠా నాయకురాలుగా సెలబ్రెటీలకు పరిచయం చేస్తూ బిగ్ బాస్ హౌస్ లోకి పంపించారు. బుధవారం విడుదల చేసిన ప్రోమోలో దోమల దొంగ ముఠా నాయకురాలిగా ముమైత్ బిగ్ బాస్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చి వారిని ముప్పుతిప్పలు పెట్టడం చూపించారు. ముఖ్యంగా ముమైత్ ఖాన్… ధన్ రాజు ఏడిపించడం కనిపించింది. ముమైత్ మాటలకు ధన్ రాజ్ బోరుమని ఏడ్వడం తనను ఇంట్లోంచి పంపించేయమని ఈ రాక్షసి ముమైత్ బాధ తట్టుకోలేకపోతున్నానని అనడం కనిపించింది.

ముమైత్ ధన్ రాజ్ నే కాదు అందరినీ ఓ ఆట ఆడుకుంటోంది. ఇలా ముమైత్ ధాటికి ఇక నుంచి బిగ్ బాస్ షో మరింత వివాదాస్పదంగా గొడవలు, కొట్లాటలతో సాగడం ఖాయంగా కనిపిస్తోంది. అసలు ఆట రాబోయే రోజుల్లో మొదలు కాబోతోంది. ముమైత్ ను సెలబ్రెటీల పని పట్టడానికే పంపించారని అర్థమైంది.

To Top

Send this to a friend