‘మామ్‌’ ట్రైలర్‌ రివ్యూ

అతిలోక సుందరి చాలా సంవత్సరాల తర్వాత ‘ఇంగ్లీష్‌ వింగ్లీష్‌’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా తప్ప మరే సినిమాతో కూడా శ్రీదేవి సక్సెస్‌ను దక్కించుకోలేక పోయింది. దాంతో కాస్త గ్యాప్‌ తీసుకుని శ్రీదేవి నటించిన చిత్రం ‘మామ్‌’. ఈ సినిమాలో ఒక తల్లిగా ఆమె కనిపించబోతుంది. ఇంగ్లీష్‌ వింగ్లీష్‌లో తరహాలోనే ఈ సినిమాలో కూడా ఒక మంచి పాత్రను పోషిస్తున్నట్లుగా చెబుతూ వచ్చారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌ ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు భారీగా వచ్చాయి.

సినిమా త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా ట్రైలర్‌ను విడుదల చేయడం జరిగింది. ‘మామ్‌’ చిత్రం ట్రైలర్‌ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేస్తుంది. శ్రీదేవి అద్బుతమైన నటనతో పాటు, మునుపటి అందంతో ఆమె ఈ చిత్రంలో కనిపిస్తుంది. సినిమా ఒక పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని ట్రైలర్‌ చూస్తుంటే అనిపిస్తుంది. శ్రీదేవి ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుని ఉంది. నిర్మాణంలో కూడా భాగస్వామిగా ఉండటం వల్ల ప్రత్యేక శ్రద్ద పెడుతుంది.

హిందీలో తెరకెక్కిన ఈ సినిమాను తమిళం మరియు తెలుగులో కూడా విడుదల చేయాలని భావిస్తున్నారు. అందుకోసం స్వయంగా శ్రీదేవి తన పాత్రకు తెలుగు మరియు తమిళంలో డబ్బింగ్‌ చెబుతుంది. తెలుగు మరియు తమిళంలో ఈ సినిమాను భారీగా విడుదల చేసే ప్లాన్‌ చేస్తున్నారు.

To Top

Send this to a friend