రాజమౌళి తర్వాతి సినిమాకు కొత్త హీరో..

నందమూరి బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ను ముంబైలోని ఓ ఫేమస్ యాక్టింగ్ స్కూల్లో జాయిన్ చేశాడు బాలయ్య.. ఆ ట్రైనింగ్ ఆగస్టు నెలాఖరులో అయిపోతుందట.. టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలక్రిష్ణ తనయుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీపై ఎన్నో రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడినట్టే కనిపిస్తోంది. నందమూరి బాలయ్య 100 వ చిత్రం శాతకర్ణిలోనే మోక్షజ్ఞ పరిచయం అవ్వాల్సి ఉంది. కానీ ఆ సినిమాలో మోక్షజ్ఞ కు సరిపడా పాత్ర లేకపోవడం సాధ్యం కాలేదు. ఆ తర్వాత చాలా మంది దర్శకులతో బాలయ్య మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీపై చర్చిస్తూనే ఉన్నాడు..

బాహుబలి తర్వాత రాజమౌళి తీయబోయే సినిమా ఏంటీ.. దానికి హీరో ఎవరనే ప్రశ్న చానాళ్లుగా మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల పైసా వసూల్ టీజర్ లాంచ్ కు వచ్చిన రాజమౌళితో బాలయ్య సమావేశమవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ సమావేశంలో తన కొడుకును హీరోగా చేయడానికి రాజమౌళి దర్శకత్వం వహించాలని కోరాడట.. దీనికి రాజమౌళి కూడా సరేననడంతో ఇప్పుడు రాజమౌళి తర్వాత సినిమాలో హీరోగా మోక్షజ్ఞ పేరు కన్ఫమ్ అయినట్టే అంటున్నారు ఫిలింనగర్ వర్గాలు.

బాహుబలితో రాజమౌళి ప్రతిభ విశ్వవ్యాప్తం అయ్యింది. అలాంటి రాజమౌళి ఇప్పుడు మోక్షజ్ఞ తో సినిమా చేస్తుండడంతో అతడి భవిష్యత్ ఎక్కడికో వెళ్లిపోతుందని.. స్టార్ గా ఎదిగేందుకు రాజమౌళి దర్శకత్వం ఎంతో సాయపడుతుందని సంబరపడుతున్నారట బాలయ్య ఫ్యాన్స్.. ఇలా మొదటి సినిమాకే అగ్ర దర్శకుడితో చేస్తున్న మోక్షజ్ఞ లక్కీ చాన్స్ కొట్టేసినట్టే కనిపిస్తోంది.

To Top

Send this to a friend