కులమూ.. కులమూ అంటూ వ్యర్థవాదములెందుకు..?

ఫేస్ బుక్, వాట్సాప్ లలో ఎక్కడ చూసినా కులసంఘాల గ్రూపులే.. రాజకీయ గ్రూపులను పక్కనపెడితే ఈ కులాల గ్రూపులు ఇప్పుడు ఎక్కువయ్యాయి. ఫోన్, సిస్టం ఓపెన్ చేస్తే చాలు కులపోల్లందరూ ఒక్కటై తమ కులాన్ని వేయినోళ్ల పొగుడుతూనే ఉంటారు. ఏదో సాధిద్దామని భీష్మ ప్రతిజ్ఞలు చేస్తూనే ఉంటున్నారు.

టాలీవుడ్ లో అగ్రనటుడు మోహన్ బాబుకు అంతగా కులపట్టింపు లేదు. ఆయన కమ్మ కులస్థుడైనా సరే కులాల జాఢ్యాలకు దూరంగా ఆయన కొడుకుకు రెడ్డి అమ్మాయిని ఇచ్చి వివాహం జరిపించాడు. ఈ ఒక్క ఉదాహరణే కాదు.. ఆయన అసలు పేరు భక్తవత్సలం నాయుడు అయినా కూడా ఆ పేరుతో పిలవవద్దని ఆయన సూచిస్తుంటారు. అలాంటి డైలాగ్ కింగ్ మోహన్ బాబును ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ మీకు కులగజ్జి ఉందని అంటే దానికి మోహన్ బాబు సీరియస్ అయ్యి.. ‘చంద్రబాబు వెంట ఉంటావ్ నువ్వు.. నీకే కులగజ్జి ఎక్కువ’ అని అప్పట్లో అనేశాడు..

ఇక ఈ మాటలు పట్టుకొని సోషల్ మీడియాలో ఎవరికి కులగజ్జి అని పోస్టులు , కామెంట్ల పరంపర కొనసాగుతూనే ఉంది. ఎవ్వరు ఔనన్న కాదన్న కూడా ఏపీలో కులజాఢ్యం ఎక్కువే.. అందుకే కమ్మ సామాజికవర్గ చంద్రబాబుకు.. అదే సామాజిక వర్గానికి చెందిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఈనాడు రామోజీరావులు, ఇతర న్యూస్ చానాళ్ల మీడియా అధిపుతులు కొమ్ముకాస్తూనే ఉన్నారు.

ఇక వీరి తర్వాత ఇంకో బలమైన సామాజిక వర్గం రెడ్డిలకు ప్రాతినిధ్యం వహిస్తున్న జగన్ మోహన్ రెడ్డి గ్రూపు కూడా తమ కులపోళ్లతో పెద్ద లాబీయింగే నడుపుతోంది. రెడ్డిలకు పలు మీడియా సంస్థలున్నాయి. ఈ కులాల కుంపట్ల కారణంగా రాజకీయాలు, సోషల్ మీడియా, జనాల మధ్య పెద్ద అడ్డుగోడలు వస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇక కులం గోడలు కూల్చేయాలని తమ టీవీలో చెప్పుకునే టీవీ9 సీఈవో రవిప్రకాశ్ కూడా అదే కులగజ్జిలో ఆయన సామాజికవర్గానికి చెందిన రాజకీయ పార్టీకి కొమ్ముకాయడం కొసమెరుపు..
సోషల్ మీడియాలో కులజాఢ్యానికి సంబంధించిన ఓ ఫొటో కింద చూడొచ్చు..

To Top

Send this to a friend