మోడీనా మజాకా!!

‘ఒకటి కాదు.. రెండు కాదు రూ.89 కోట్లు అయ్యా.. ఒక్కో ఓటుకు నాలుగు వేలు పంచేశాం.. అధికారం చేతిలో ఉందిగా అని ఎన్నికలు రద్దు చేస్తే ఎలా..’ శశికళ వర్గం నేతలు బోరుమంటున్నారు.. జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థి శశికళ మేనల్లుడు దినకరణ్ పోటీచేస్తున్నారు. ఆయన్ను గెలిపించడానికి సీఎం ఫళనిస్వామి, మంత్రులు ఆర్కేనగర్ లో పాగా వేసి 89 కోట్లు ఓటర్లకు పంచేశారు. మొదటినుంచి తమిళనాడుపై శీతకన్ను వేసిన మోడీ అనుకున్నట్టే అక్కడ ఎన్నికల అధికారులతో సోదా నిర్వహించి చివరి నిమిషంలో ఎన్నికలు రద్దు చేయించారు. దీంతో మోడీ విసిరిన పాచికకు శశికళ వర్గం దెబ్బైపోయింది.

మోడీ ఎందుకో తమిళనాడును టార్గెట్ చేశారు. జల్లికట్టు ఉద్యమంతో కేంద్రాన్ని, సుప్రీం ను ఢీకొట్టిన తమిళనాడు ప్రజలు, నాయకులతో ఆడుకుంటున్నారు. శశికళ ఉదంతంలో గవర్నర్ తో తమిళనాడు నాయకుడు రాజకీయాలను ఓ ఆట ఆడుకున్న మోడీ ఇప్పుడు కూడా వదలలేదు. శశికళ వర్గం అభ్యర్థి దినకరణ్ పోటీచేసే ఆర్కేనగర్ పై పంజావిసిరి ఏకంగా ఉప ఎన్నికనే రద్దు చేశారు.

తనవాడైతే కంచంలో.. పగవాడైతే విస్తరాకులో పెట్టడం మోడీ నైజం.. అది అంతటా అమలు చేస్తున్నాడు. ఎన్నికల్లో డబ్బులు పంచడం కామన్.. అప్పట్లో జగన్ ఉప ఎన్నికల్లో పోటీచేస్తే 500 కోట్లు ఖర్చుపెట్టాడనే ప్రచారముంది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మోడీ ప్రియ మిత్రుడు చంద్రబాబు 50 లక్షలు రేవంత్ రెడ్డి ద్వారా ఎమ్మెల్సీ స్టీఫెన్ సన్ కు ఇప్పించి కేసీఆర్ కెమెరాకు అడ్డంగా దొరికిపాయారు. నిన్నటికినిన్న ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోట్లు పెట్టి వైసీపీ ప్రజాప్రతినిధులను కొని టీడీపీ ఎమ్మెల్సీలను గెలిపించుకున్నారు. ఇవన్నీ బహిరంగ రహస్యలే.. అంతటా డబ్బు ప్రవాహలే.. కానీ ఇక్కడెక్కడా మోడీ వేలు పెట్టలేదు. ఎన్నికలను రద్దు చేయలేదు. కానీ తమిళనాడులోనే ఎందుకు ఎన్నికలు రద్దు చేసినట్టు.? మోడీ ఎందుకంత కఠినంగా వ్యవహరిస్తున్నట్టు..?

దక్షిణాదిన పాగా వేయాలనుకుంటున్న మోడీకి ఆది నుంచి తమిళనాడు కొరకరాని కొయ్యగానే మిగిలింది. జయలలిత నుంచి శశికళ, డీఎంకే ఇలా ప్రాంతీయ పార్టీలు కేంద్రంలో ఎక్కువ సీట్లు సాధించి మోడీని ఢీకొంటున్నాయి. అందుకే జయ మరణించినప్పుడు తమిళనాడును చేజిక్కించుకోవాలనుకున్న మోడీకి శశికళ పెద్ద షాక్ ఇచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మోడీ అనుంగశిష్యుడు పన్నీర్ సెల్వంను అణిచివేసింది. ఆ పగ ఇంకా మనసులో పెట్టుకొని మోడీ ఇలా ఆర్కేనగర్ ఉప ఎన్నికను రద్దు చేసేశారు. శశికళకు 89 కోట్ల నష్టం తెచ్చారు.

To Top

Send this to a friend