‘నరేంద్రమ్మ’ పెట్టదు.. అడుక్కుతిననివ్వదా.?

అమ్మా పెట్టదు.. అడుక్కుతిననివ్వదు అన్నట్టుంది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పరిస్థితి.. విభాజిత నవ్యాంధ్రకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏపీకి అప్పులు తెచ్చుకోవడానికి అనుమతిని కేంద్రం నిరాకరించడం తాజాగా వివాదాస్పదమైంది. కేంద్రం నిధులు ఇవ్వక, అప్పులు తెచ్చుకోనీయకుండా అడ్డుకోవడంపై ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పుడు రగిలిపోతున్నారట..

రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి నిధుల కొరత అనివార్యమైంది. ఆదాయమంతా హైదరాబాద్ నుంచే రావడం.. అది తెలంగాణకు పోవడంతో మిగులు బడ్జెట్ తో తెలంగాణ రాష్ట్రం కళకళాలాడుతుంటే.. కనీసం రాజధాని కూడా లేని ఏపీ వెలవెలబోతోంది. అందుకే కనీసం ఇంటా బయటా,, విదేశాల్లో రుణాలు తెచ్చుకొనైనా అమరావతి రాజధాని నిర్మాణం సహా పలు అభివృద్ధి పథకాలు చేసుకుంటాం అనుమతివ్వండని ఏపీ ప్రభుత్తం ఇటీవల కేంద్రానికి లేఖ రాసిందట.. కనీసం కేంద్రమైనా ఏపీ అభివృద్దికి నిధులు ఇవ్వాలని వేడుకుందట.. ఈ రెండు ప్రతిపాదనలను కేంద్రం అంగీకరించలేదని సమాచారం.

కేంద్రంలోని ఎఫ్ఆర్బీఎం చట్టం ప్రకారం ఏ రాష్ట్ర ప్రభుత్వమైన తమ రాష్ట్ర ఆదాయంలో 25శాతం మాత్రమే అప్పులు తెచ్చుకోవాలి. కానీ ఇప్పటికే ఏపీ 2014-15లో 29శాతం తెచ్చుకుంది. ఈ సంవత్సరం 27.04 శాతం తెచ్చుకుంది. ఇవీ కాక రాజధాని అమరావతి కోసం సింగపూర్ ఇతర దేశాల నుంచి రుణాలు సమీకరించే పనిలో పడింది. దీనిపై కేంద్రాన్ని సంప్రదించగా మీకు ఇదివరకే అప్పుల పరిమితి దాటిందని.. ఇక తీసుకోవడం కుదరదని కేంద్రం ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ నిర్ణయం ఏపీ ప్రభుత్వానికి శరాఘాతంగా మారింది.

To Top

Send this to a friend