మోడీ సక్సెస్ స్టోరీ..

‘గడిచిన మూడేళ్ల పాలనలో బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం వల్ల లబ్ధిపొందిన సగటు భారతీయుడు ఉన్నాడా అని’ ఈ మధ్య ఓ జర్నలిస్టు నన్ను సూటి ప్రశ్న వేశాడు. తెలుగు రాష్ట్రాల సీఎంలు రేషన్ బియ్యం, పింఛన్లు, రైతులకు ఉచిత కరెంట్, మిషన్ కాకతీయ భగీరత లాంటి పథకాలతో ప్రజలకు చేరువయ్యాయి. కానీ మోడీజీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం వల్ల సామాన్యుడికి దక్కిన ఒక్క ప్రయోజన పథకం ఏంటీ చెప్పు’’ అంటే నా దగ్గర సమాధానం లేదు.

 

ఎందుకంటే మోడీ విశాల హృదయుడు.. ఆయన పథకాలు అంత త్వరగా అర్థం కావు. ఎవ్వరికీ కించత్ రూపాయి కూడా ఉపయోగం ఉండదు.. జన్ ధన్ అన్నాడు. పేదలందరితో బ్యాంకుల్లో ఖాతాలు తెరిపించాడు. అందులో నల్లధనం వేస్తానని మాట మార్చాడు. పోనీ ఖాతా తెరిచాక డబ్బులు వేసుకున్న పేదలకు ఇప్పుడు డబ్బులే ఇవ్వడం లేదు. నోట్ల రద్దు, కొరత, బ్యాంకు మినిమం బ్యాలెన్స్ లాంటి నిబంధనల చట్రంలో పేదలను తోసేశాడు. ఇక స్వచ్ఛ భారత్ తో ఎవరి చీపురు వారికి ఇచ్చి ఊడ్చేయమన్నారు. సామాన్యుడికి దీని వల్ల ఏం లబ్ధియో బీజేపీ నేతలకే తెలియలి.

ఈ మధ్య అమిత్ షా ప్రకటించినట్టు తెలుగు రాష్ట్రాలకు లక్ష కోట్లు ఇచ్చినా.. కోటి కోట్లు ఇచ్చినా వేస్టే.. ఎందుకంటే రాష్ట్రాలు ప్రతి సగటు పౌరుడికి లబ్ధి చేకూర్చేలా పథకాలు పెట్టాయి. ప్రజలకు చేరువ చేస్తున్నాయి. మోడీ విశాల హృదయంతో ఇప్పటివరకు జనాలను కష్టపెడుతూనే ఉన్నాడు. నోట్లు రద్దు చేసి అందరిని నడిరోడ్డు మీద బ్యాంకుల ఎదుట క్యూలు కట్టించాడు. అధికారంలోకి వస్తే నల్లధనం తెస్తానని మాటమార్చాడు. నోట్లు రద్దు తర్వాత 50 రోజుల్లో మీ దశ మారుస్తానని చెప్పి ఇప్పటికీ ఏం మార్చలేకపోయాడు.. ఏమార్చుతూనే ఉన్నాడు. అందుకే మూడేళ్ల బీజేపీ అధికారంలో మోడీకి తప్ప ఆయన చేసిన పనులు ఎవ్వరికీ నచ్చడం లేదు. బీజేపీ పండుగ సామాన్యుడికి… తోటి రాజకీయ పక్షాలకు ఏమాత్రం రుచించడం లేదనడానికి ఇంకా చాలా కారణాలున్నాయి.

To Top

Send this to a friend