‘నాయుడు’లను విడగొట్టిన పాపం మోడీదే..

వాళ్లిద్దరు ఒక్కతల్లి పిల్లలు కాదు.. కానీ ఒక కులపోళ్లే.. ప్రాంతాలు వేరు కావచ్చు.. కానీ వారి మధ్య బంధం పాతదే.. పార్టీలు వేరైనా నాయుడల సంబంధాలు మాత్రం చెక్కచెదరలేదు. ఏపీ సీఎం చంద్రబాబు కోసం ఏమైనా చేయగల ఉదారమైన స్వభావం వెంకయ్యనాయుడిది. ఏపీకి ప్రతినిధిగా ఢిల్లీలో తనకు ఉన్న పరపతితో ఇప్పటికే నిధులు, విధులు, పనుల్లో రాష్ట్రానికి బోలెడు నిధులు ఇప్పిస్తున్నారు. ఒక్క పచ్చచొక్కా వేసుకోలేదు కానీ టీడీపీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఢిల్లీలో వెంకయ్య ఉన్నారు..

అలాంటి వెంకయ్య-చంద్రబాబుల బంధాన్ని మోడీ విడగొట్టారు. ఇప్పుడు ఏపీకి దిక్కెవరే ప్రశ్న ఉదయిస్తోంది. ఇన్నాళ్లు సీనియర్ వెంకయ్య సాయంతో ఢిల్లీలో పనులు చక్కబెట్టుకున్న చంద్రబాబుకు ఢిల్లీలో పనులు చేసిపెట్టే వారే ఇప్పుడు కరువయ్యారు. మోడీని గట్టిగా అడిగే ధైర్యం చంద్రబాబుకు లేకపోవడంతో ఇక ఏపీకి అధోగతేనా అన్న ప్రశ్న వినిపిస్తోంది..

నిజానికి ఏపీ పనుల కోసం వెంకయ్య.. తన సహచర మంత్రులను గదాయించడం.. బెదిరించడం.. అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించడం చాలా ఎక్కువైందట.. ఈ విషయం ప్రధానికి తెలిసే ఆ మధ్య వెంకయ్య శాఖను మార్చారు. అయినా మారని వెంకయ్య ఏపీ పనుల కోసం తోటి కేంద్ర మంత్రుల మీద ఒత్తిడి చేస్తూనే ఉన్నాడట.. అందుకే ఇక ఏకు మేకు అవుతాడని.. తన ప్రతిష్టకు వెంకయ్య ముప్పుగా తయారవుతాడని భావించి ప్రాధాన్యం, అధికారాలు లేని, రబ్బర్ స్టాంప్ లాంటి ఉపరాష్ట్రపతి పదవిని వెంకయ్యకు మోడీ కట్టబెట్టి సాగనంపాడనే వార్త ఢిల్లీ పొలిటికల్ సర్కిల్ లో వినపడుతోంది.

ఇలా ఏపీ సీఎం చంద్రబాబు కోర్కెల చిట్టా పరిష్కరిస్తున్నాడనే కోపంతోనే వెంకయ్యను రాజకీయాల నుంచి దూరం పెట్టేలా మోడీని ప్రోత్సహించిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

To Top

Send this to a friend