బెస్ట్ ఫ్రెండ్ రుణం తీర్చుకుంటున్న మోడీ..

నిజంగా మనకు సాయం చేసిన వారిని ఎప్పటికీ మరిచిపోం. ఆ సాయానికి కృతజ్ఞతగా ఉంటాం.. ఇప్పుడు ఇండియా అదే చేస్తోంది. గత వాజ్ పేయి బీజేపీ ప్రభుత్వానికి యుద్ధంలో సాయం చేసి గెలిపించిన ఇజ్రాయిల్ రుణం తీర్చుకునేందుకు ఆ ఫ్రెండ్ కు థ్యాంక్స్ చెప్పేందుకు ఇండియా తరఫున ప్రధాని మోడీ తొలిసారి ఇజ్రాయిల్ లో పర్యటించబోతున్నారు..

కార్గిల్ యుద్ధం.. అదును చూసి భారత్ పై పాకిస్తాన్ యుద్ధం మొదలుపెట్టింది. నిజానికి అప్పుడున్న బీజేపీ ప్రభుత్వం, వాజ్ పేయిలు యుద్ధం చేసే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే భారత సైన్యం వద్ద సరిపడా మందుగుండు సామగ్రి, యుద్ధ బాంబులు అంతగా లేవు. అయితే పాక్ సైన్యం చొరబాట్లు, భారత సైన్యంపై దాడులు చంపివేయడాలు ఎక్కువై పోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇండియా యుద్ధంలో దిగింది. కానీ సరిపడా యుద్ధ బాంబులు, రక్షణ సామాగ్రి అప్పుడు మన వద్ద లేవు.

ఆ సమయంలో బాంబులు, యుద్ధవిమానాల సాయం కోసం అమెరికా సహా బ్రిటన్, ఫ్రాన్స్ సాయం కోరినా అవి తటస్థ వైఖరి అవలంభించి ఇండియాను దూరం పెట్టాయి.. కానీ మనం కోరగానే ఇజ్రాయిల్ ముందుకొచ్చింది. తన వద్ద ఉన్న భారీ యుద్ధ క్షిపణులు, అత్యాధునిక యుద్ధ సామాగ్రిని అందించింది. ఆ నాడు ఇజ్రాయిల్ పై అమెరికా ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా భారత్ పై ప్రేమతో ఇజ్రాయిల్ యుద్ధ సామాగ్రిని పంపి మన వెంట నిలిచింది.

ఇజ్రాయిల్ అందించిన రక్షణ సాయంతోనే ఇండియా కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ పని పట్టింది. చివరకు పాకిస్తాన్ ఓటమిని ఒప్పుకొని పాక్ వెనక్కి తగ్గడం.. ఇండియా ఆ యుద్ధంలో విజయం సాధించడం జరిగిపోయింది..ఇలా ఇజ్రాయిల్ సాయంతోనే ఇండియా కార్గిల్ యుద్ధం గెలిచింది. మనల్ని గట్టెక్కించిన మిత్రుడికి ఇన్నాళ్లకు మోడీజీ గుర్తించి ఆ దేశంలో పర్యటించబోతున్నారు. ఇజ్రాయిల్ లాంటి మంచి మిత్రదేశానికి భారత్ తరఫున థ్యాంక్స్ చెప్పబోతున్నారన్నమాట.. ఇప్పటికీ ఎన్నో రక్షణ, వ్యవసాయ, సాంకేతిక రంగాల్లో ఇండియా-ఇజ్రాయిల్ కలిసి నడుస్తున్నాయి. ఇప్పుడు ఇండియాకు అమెరికా కంటే కూడా ఇజ్రాయిలే మంచి మిత్రుడు. అందుకే స్వాతంత్ర్యం వచ్చాక ఇప్పటివరకు ఏ ప్రధాని పర్యటించని ఇజ్రాయిల్ లో ఇండియా ప్రధాని మోడీ వచ్చే నెలలో పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

To Top

Send this to a friend