భారతీయుల కోరిక అది మోడీజీ..

‘అత్తలేని కూతురు ఉత్తమురాలు ఓ యమ్మో’ అనే పాటను ఇప్పుడు మోడీని చూశాక తిరిగి రాయాల్సిందే.. ‘భార్యలేని మోడీ.. బాదరబందీ లేని వారు’ అని పాడుకోవాల్సిందే.. ఎందుకంటే మోడీ విదేశీ పర్యటనల్లో ఆరితేరిపోయాడు. బ్రేక్ ఫాస్ట్ పోర్చుగల్ లో చేస్తే లంచ్ అమెరికాలో.. డిన్నర్ నెదర్లాండ్ లో చేసేస్తున్నారు. ఆయన వెంట భార్య ఉంటే ఇంతలా తిరగనిచ్చేది కాదని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.

రేయనక.. పగలనక.. మన మోడీ జీ ప్రపంచయాత్ర చేస్తూ తెగ బిజీగా మారిపోయాడు. ఎప్పుడు ఇండియాలో ఉంటాడో ఎప్పుడు విదేశాలకు చెక్కేస్తాడో ఎవ్వరీకి అంతుపట్టడం లేదు. రెండు రోజుల క్రితం భారత్ నుంచి బయలు దేరి మొదట పోర్చుగల్ కు మోడీ చేరుకున్నాడు. అక్కడ భేటిలు, విహారయాత్రలు పలు ఒప్పందాలు చేసుకొని అమెరికాకు ఎగిరిపోయాడు. అక్కడ ట్రంప్ ఆత్మీయ స్వాగతం, సత్కారం, వైట్ హౌస్ లు విందులు ముగిశాక ఇండియాకు తిరిగి రావచ్చు కదా.. రాలేదు. అంతలోనే యూరప్ లోని నెదర్లాండ్ లో కాలుమోపి.. అక్కడి ప్రధాని సైకిల్ గిఫ్ట్ గా ఇస్తే దానిమీద నెదర్లాండ్ వీధుల్లో ఫొటోలకు ఫోజిచ్చాడు. ఇలా మన ప్రధాని అడుగుపెట్టని దేశం లేదు. చేయని పబ్లిసిటీ స్ట్రంట్ లేదు..

వచ్చే నెలలో మోడీ ఇజ్రాయిల్ సహా మధ్య ఆసియా దేశాల్లో పర్యటించబోతున్నాడట.. ఇలా భార్య లేని మోడీ దేశయాటనల్లో మునిగితేలుతున్నాడు. అదే ఓ భార్య ఉంటే ఆయన ఒక్క దేశానికే పరిమితమైపోయేవాడేమో.. ఎలాంటి బాదరబందీ లేకుండా పెళ్లాం గొడవ లేకుండా విహారయాత్ర చేస్తున్న మోడీజీ త్వరలోనే ప్రపంచంలోని 196కు పైగా దేశాల్లో భారతీయులందరం కోరుకుందాం..

To Top

Send this to a friend