ఆ జాబ్ కొడితే .. 100 కోట్లు గ్యారెంటీ..

తెలంగాణలో వెలుగు చూసిన మియాపూర్ కుంభకోణం తవ్వితే కళ్లు చెదిరే అక్రమాలు బయటపడుతూనే ఉన్నాయి. హైదరాబాద్ లో రిజిస్ట్రార్ గా ఉంటే ఎంత లాభమో సస్పెండ్ అయిన రిజిస్ట్రార్ల బతుకులు చూశాక అర్థమవుతోంది. వారి ఆస్తుల చిట్టా పోలీసులు తవ్వి చూడగా వందల కోట్ల ఆస్తులు బయటపడ్డాయి. ఇదంతా చూశాక మన జాబులన్నీ వదిలేసి.. రిజిస్ట్రార్ పోస్టు కొడితే చాలు అని అనిపిస్తోంది..

ముగ్గురు సబ్ రిజిస్ట్రార్ల ఏసీబీ కస్టడీ ముగిసింది. సబ్ రిజిస్ట్రార్ యూసుఫ్‌కు ఉస్మాన్ సాగర్‌లో 2 ఎకరాల స్థలం, రూ.49 లక్షల నగదు, కుమారుడి మెడికల్ చదువుకు రూ.30 లక్షలు ఖర్చు చేసినట్లు ఆధారాలు లభించాయి. మామ పేరుతో యూసుఫ్ బినామీ ఆస్తులు కొన్నట్లుగా అధికారులు గుర్తించారు. మార్కెట్ విలువ ప్రకారం యూసుఫ్‌కు రూ.40 కోట్ల ఆస్తి, మరో సబ్ రిజిస్ట్రార్ రమేశ్ చంద్రారెడ్డికి రూ.50 కోట్ల ఆస్తులు, 10 ఎకరాల వ్యవసాయ భూమి, ఇళ్ల స్థలాలు 2, 3.5 కిలోల బంగారం, రూ. కోటికి పైగా నగదు, రూ.30 లక్షల డిపాజిట్లు, కొడుకుల మెడికల్ చదువుల కోసం రూ.కోటి ఖర్చు చేసినట్లుగా అధికారులు ఆధారాలు సేకరించారు. బినామీల పేరుతో పెద్ద ఎత్తున ఆస్తులు కొనుగోలు చేసినట్లు గుర్తించారు.

కాగా మూడో సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావుకు రూ.100కోట్లు ఆస్తులున్నట్లు ఏసీబీ గుర్తించింది. మూసాపేట్లో 11 ఎకరాల స్థలం, 6 ఇళ్ల స్థలాలు, 11 బ్యాంకు ఖాతాలు, వివిధ కంపెనీల్లో రూ.13 కోట్ల పెట్టుబడులు, మన్సూరాబాద్‌లో ఒక ఇల్లు, మారేడ్‌పల్లిలో రూ.5 కోట్ల కమర్షియల్ కాంప్లెక్స్, రూ. కోటిన్నర విలువైన ఇన్సూరెన్స్ పాలసీలు, రూ. రెండున్నర కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు, రూ.కోటి క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపులు, 11 బ్యాంకు ఖాతాలు, వివిధ కంపెనీల్లో రూ.13 కోట్ల పెట్టుబడులు, షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి షాపింగ్ మాల్స్ నిర్మించినట్లు ఏసిబి గుర్తించింది.

ఇలా సాధారణ సబ్ రిజిస్ట్రార్లు 100 కోట్లు సంపాదించారు. మనం జీవితాంతం పనిచేసినా అంత సంపాదించలేం.. అందుకే ఈ జాబులన్నీ వదిలి సబ్ రిజిస్ట్రార్ పోస్టులకు అప్లై చేసి కొట్టండి మీ మనవలు.. వారి మనవలు బతికేంత సంపాదించుకోవచ్చు..

To Top

Send this to a friend