మిస్‌ ఇండియా రేసులో మిస్‌ తెలంగాణ

 

మిస్‌ ఇండియా రేసులో చాలా కాలం తర్వాత తెలంగాణకు చెందిన అమ్మాయి నిలిచింది. గత ఫిబ్రవరిలో జరిగిన మిస్‌ తెలంగాణ పోటీల్లో విజేతగా నిలిచిన సిమ్రన్‌ చౌదరి మిస్‌ ఇండియాలో నిలవడం జరిగింది. 2014లో హమ్‌తుమ్‌ అనే చిత్రంతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సిమ్రన్‌ చౌదరి మోడలింగ్‌పై ఆసక్తితో పలు ఫ్యాషన్‌ షోల్లో పాల్గొంది. ఈ సంవత్సరం మిస్‌ తెలంగాణగా ఎంపిక కావడంతో ఆమె దశ తిరిగినట్లయ్యింది.

‘హమ్‌తుమ్‌’ సినిమా సక్సెస్‌ కాక పోవడంతో సినిమాల్లో ఈమెకు అవకాశాలు రాలేదు. అయినా నిరాశ చెందకుండా మోడలింగ్‌లో రాణించాలనే పట్టుదలతో ప్రయత్నాలు చేస్తూనే ఉంది. మిస్‌ ఇండియా కాంపిటీషన్‌ ఫైనల్‌కు చేరింది. ఈనెల 25న రాజస్థాన్‌లో జరుగబోతున్న మిస్‌ ఇండియా ఫైనల్స్‌లో 29 మంది ముద్దుగుమ్మలతో కలిసి సిమ్రన్‌ చౌదరి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది.

తెలంగాణకు చెందిన సిమ్రన్‌ చౌదరి గెలిచి తెలుగు రాష్ట్రాల ఖ్యాతిని పంచాలని, సౌత్‌ నుండి ఇలాంటి పోటీలకు పెద్దగా ప్రాముఖ్య ఉండదు. ఎక్కువగా ఉత్తరాది ముద్దగుమ్మలు మిస్‌ ఇండియాగా ఎన్నిక కావడం జరుగుతుంది. కాని ఈసారి మాత్రం సౌత్‌ ఇండియా మొత్తం కూడా సిమ్రాన్‌ చౌదరి మిస్‌ ఇండియాగా నిలవాలని కోరుకుంటున్నారు. మనం అంతా కూడా మన సిమ్రన్‌ మిస్‌ ఇండియాగా ఎంపిక అవ్వాలని కోరుకుందాం.

To Top

Send this to a friend