చదువుంటేనే సర్పంచ్ పదవి…

చదువురాని వారు సర్పంచ్‌లుగా ఎన్నికయ్యే అవకాశం కోల్పోనున్నారు. సర్పంచ్‌గా పోటీ చేసేందుకు కనీస విద్యార్హతను ప్రవేశపెట్టేందుకు రంగం సిద్దమైంది. సర్పంచ్‌గా పోటీ చేయాలంటే కనీసం 10 వ తరగతి వరకు చదివి ఉండాలన్న నిబంధనను ప్రభుత్వం తీసుకురానుంది. ఈ మేరకు కేంద్రం ప్రతిపాదన చేసింది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. టెన్త్ తప్పనిసరి చేస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ పత్రిపాదనలు సిద్ధం చేసింది. ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందనున్నాయి.

ఇదే జరిగితే వచ్చే ఎన్నికల నుంచి పదో తరగతి విద్యార్హత ఉన్న వారు మాత్రమే సర్పంచ్‌లు , ఎంపీటీసీలు, జెడ్పీటీసీ, ఎంపీపీ , జెడ్పీ చైర్మన్‌ పదవులను స్వీకరించేందుకు అర్హులవుతారు. అయితే కనీస విద్యార్హత నిబంధన ఎంపీలు, ఎమ్మెల్యేలకు లేదు. కానీ వారికి లేని విధంగా సర్పంచ్‌లకు చెక్ పవర్‌ ఉండడం, అదే సమయంలో చదువురాని వారిని సర్పంచ్‌ , ఎంపీటీసీ, జెడ్పీటీసీ తదితర పదవుల్లో కూర్చోబెట్టి వారి కుటుంబసభ్యులు, ఇతరులు చక్రం తిప్పుతున్న నేపథ్యంలో కనీస విద్యార్హత ఉండాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. హర్యానా తదితర రాష్ట్రాల్లో కనీస విద్యార్హత నిర్ణయించడం వల్ల.. అక్కడ స్థానిక సంస్థల పాలన మిగిలిన రాష్ట్రాల్లో కంటే మెరుగ్గా ఉందని తేలింది. దీంతో కేంద్రం అన్ని రాష్ట్రాలకు కనీస విద్యార్హతపై ప్రతిపాదనలు పంపింది. అయితే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, ఎంపీల్లోనూ చాలా మంది చదువురాని వారు ఉన్నారు. కాబట్టి వారికి కనీస విద్యార్హత పెట్టాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది.

రాబోయే ఎన్నికల్లో. ఎంపీటీసీ, జెడ్పిటిసీ అనే పదవులు కనుమరుగు కానున్నాయి..రెండంచల విధానం అమలు చేయడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు.అదే సమయంలో గ్రామస్తులను ఇన్ వాల్వు చేసేటట్లు మార్పులు తీసుకు రానున్నారు.ప్రతి 500 మంది ఉన్న గిరిజన తాండలను గ్రామ పంచాయితీలుగా ఏర్పాటు చేయనున్నారు. నియోజకవర్గాల పునఃర్విభనన చేసి మరిన్ని నియోజకవర్గాలను ఏర్పాటుకు దస్త్రం ముందుకు వచ్చింది. అది ఆచరణలోకి వస్తే పరిపాలన సుగమం కావొచ్చూ…..ఏది ఏమైనా మరో 187 రోజులు ఆగితే అన్ని చూడొచ్చు…..

To Top

Send this to a friend