మేమూ ఫేస్ బుక్, వాట్సాప్ నిషేధిస్తాం..


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న చర్యలు భారతీయులకు శరాఘాతంగా మారాయి. కొత్తగా భారతీయులకు అమెరికాలో ఉద్యోగాలు దక్కడం లేదు. అమెరికాలో ఉన్నవారికి కూడా ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న సంస్కరణల మూలంగా ఈ పరిస్థితి దాపురించింది. దీనిపై దేశ పారిశ్రామికవేత్త, ఎయిర్ టెల్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ తీవ్రంగా స్పందించారు.. భారత ఐటీ నిపుణులపై ప్రభావం చూపేలా అమెరికా వీసా నిబంధనలు కఠినతరం చేయడంపై మండిపడ్డారు.

ఇండియాలో కొనసాగుతున్న ఫేస్ బుక్ కు 20కోట్ల మంది ఖాతాదారులున్నారని.. అలాగే వాట్సాప్ కు 15 కోట్లు, గూగుల్ యూజార్లు 10 కోట్ల మంది ఉన్నారని.. భారతీయులను అమెరికా నుంచి వెళ్లగొడితే.. ఇండియాలో భారీ లాభాలు ఆర్జిస్తున్న అమెరికిన్ కంపెనీలైన ఫేస్ బుక్, వాట్సాప్, గూగుల్ లను కూడా తాము నిషేధిస్తే ఏమవుతుందో అమెరికా అధ్యక్షుడు తెలుసుకోవాలని మిట్టల్ హెచ్చరించారు.

వందలు, వేల కోట్ల ఆదాయం పొందుతున్న అమెరికన్ కంపెనీలు భారత్ సహకరించబట్టే మనగడ సాగిస్తున్నాయన్నారు.. భారతీయులే అమెరికన్ సంస్థల చైర్మన్లుగా అమెరికాలో ఉన్నారని.. ఇలా అన్ని దేశాలు.. అమెరికన్ సంస్థలను నిషేధిస్తే అమెరికా పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలని ట్రంప్ ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు సునీల్ భారతీ మిట్టల్.

To Top

Send this to a friend