మేలిమి బంగారానికి మకిలీ..


అబ్బో తెగ ఊదరగొట్టేశాడు.. అవినీతి రహిత పాలన అన్నాడు. ఆమ్ ఆద్మీ అంటూ రాజకీయాల్లోకి వచ్చాడు. తీరా ఇప్పుడు అవినీతి మకిలీతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ’ఓ భూపందేరంలో రెండు కోట్లు కేజ్రీవాల్ లంచం తీసుకున్నాడని.. అలా తీసుకోవడం తాను కళ్లారా చూశానని’ కేజ్రీవాల్ బహిష్కరించిన మాజీ మంత్రి కపిల్ మిశ్రా సంచలన ఆరోపణలు చేశాడు. పైగా మహాత్మాగాంధీ సాక్షిగా చెబుతున్నానని మీడియా ముందు చెప్పేశాడు.. ఈ ఆరోపణలు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పీఠానికే ఎసరు పెట్టేలా ఉన్నాయి.

అయితే కేజ్రీవాల్ ఈ ఆరోపణలపై స్పందించడం లేదు. మీడియా ముందుకొచ్చి తాను అలా చేయలేదని బహిరంగంగా వ్యాఖ్యానించకపోవడంతో ఈ మేలిమి బంగారం నకిలీది అయిపోయిందని ప్రతిపక్షాలు ఆడిపోసుకుంటున్నాయి. ఇన్నాళ్లు సామాన్యుడు, అవినీతి రహిత నాయకుడు అని ఊదరగొట్టిన వారే కేజ్రీవాల్ అవినీతి ఆరోపణలపై ముక్కున వేలేసుకుంటున్నారు.

రాజకీయాల్లో డబ్బు, అవినీతి కామన్ గా మారింది. అది బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా ఆ ప్రవాహం ఆగడం లేదు. అయితే అందరూ గుట్టుగా చేస్తున్నారు. చంద్రబాబు లాంటి వారే ఓటుకు నోటు పేరుతో రహస్యంగా ఓట్లు కొనేద్దామని ట్రై చేశారు. కేసీఆర్ చురుగ్గా స్పందించబట్టి దొరికిపోయాడు కానీ.. దొరక్కపోతే చంద్రబాబు దొరే అయ్యేవాడు. తాను నీతిమంతుడని ఎలుగెత్తి చాటేవాడు. అయినా రాజకీయాల్లో అవినీతి అన్నది కామన్. అది జనాలకు తెలుసు.. కానీ సీక్రెట్ గా చేస్తేనే నాయకులకు మనుగడ..

కేజ్రీవాల్ రూ.2కోట్లు లంచం తీసుకున్నాడని ఆమ్ ఆద్మీ బహిష్కృత మాజీ మంత్రి ఆరోపించడం వెనుక బీజేపీ పెద్దల హస్తం ఉందని ఇన్ సైడ్ టాక్.. బీజేపీ పెద్దలే ఇలా కపిల్ మిశ్రా తో లోపాయికారిగా ఒప్పందం చేసుకొని కేజ్రీవాల్ ను టార్గెట్ చేశారని సమాచారం. ఏదైతేనేం.. రాజకీయాల్లో జాగ్రత్తగా ఉండకపోతే ఏం జరుగుతందనే దానికి కేజ్రీవాల్ ఉందంతం ఒక గొప్ప ఉదాహరణ..

To Top

Send this to a friend