డ్రగ్స్‌ వ్యవహారంలో ఒక మెగా హీరో?

ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఒక్కటే చర్చ అదే డ్రగ్స్‌. మొదట విద్యార్థులు డ్రగ్స్‌ తీసుకుంటున్నారని సమాచారం అందుకున్న పోలీసులు వారికి డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్న వారిపై నిఘా పెట్టి కెల్విన్‌ అనే ముఠా నాయకుడిని అరెస్ట్‌ చేయడం జరిగింది. అతడి వద్ద వందల సంఖ్యలో సినీ ప్రముఖులకు చెందిన నెంబర్‌లు ఉన్నాయని తేలింది. అయితే అందరిని అనుమానించడం తగదని, అతడిని విచారించి ఇప్పటి వరకు 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేయడం జరిగింది.

తాజాగా ఈ కేసును ఎంక్వౌరీ చేస్తున్న అకున్‌ సబర్వాల్‌ మరోసారి కెల్విన్‌ను స్వయంగా ప్రశ్నించరని, ఆయన పలు కీలక విషయాలను కెల్విన్‌ నుండి సేకరించినట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే పలువురు సెలబ్రెటీలను మరియు వారి పిల్లలను కాపాడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని, వారికి అందుకే నోటీసులు ఇవ్వలేదు అనే విమర్శలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో సురేష్‌బాబు చిన్న కొడుకు అభిరామ్‌ మరియు మెగా హీరో అల్లు శిరీష్‌లపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

సురేష్‌బాబు చిన్న కొడుకు అభిరామ్‌ విషయమై సురేష్‌బాబు మీడియా ముందుకు వచ్చి స్పష్టమైన ప్రకటన చేయడం జరిగింది. తన కొడుకుకు ఎలాంటి సంబంధం లేదు అని సురేష్‌బాబు ప్రకటించారు. ఇక అల్లు శిరీష్‌పై వస్తున్న ఆరోపణలపై మెగా ఫ్యామిలీ స్పందించాల్సి ఉంది.

To Top

Send this to a friend