ప్లీజ్‌ మురగ.. మాకోసం ఒక్కటి


మెగాస్టార్‌ చిరంజీవి స్థానంను రామ్‌ చరణ్‌ మాత్రమే పొందాలని మెగా ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. అయితే రామ్‌ చరణ్‌ మాత్రం ఒకటి సక్సెస్‌ రెండు ఫ్లాప్‌లు అంటూ కెరీర్‌ను సాగిస్తున్నాడు. తోటి హీరో అల్లు అర్జున్‌ మరియు ఇతర హీరోలు భారీ సక్సెస్‌లను సాధిస్తూ దూసుకు పోతున్నారు. కాని చరణ్‌ మాత్రం వరుస సక్సెస్‌ల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో ‘రంగస్థలం’ అనే చిత్రాన్ని చేస్తున్న రామ్‌ చరణ్‌ ఆ తర్వాత మురుగదాస్‌ దర్శకత్వంలో చేసే అవకాశాలు కనిపిస్తునన్నాయి.

మెగా ఫ్యామిలీకి సన్నిహితంగా ఉండే ఠాగూర్‌ మధు ప్రస్తుతం తీవ్రంగా ఆ ప్రాజెక్ట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మహేష్‌బాబుతో ‘స్పైడర్‌’ చిత్రాన్ని చేస్తున్న మురుగదాస్‌ ఆ తర్వాత తెలుగులో చరణ్‌తో సినిమాలు చేసే అవకాశం కనిపిస్తుంది. మురుగదాస్‌ గతంలో చిరంజీవి హీరోగా ‘స్టాలిన్‌’ చిత్రాన్ని చేసిన విషయం తెల్సిందే. ఆ సినిమా సమయంలో మెగా ఫ్యామిలీపై మురుగదాస్‌ కాస్త అసహనం వ్యక్తం చేశాడు. దర్శకత్వంలో వేరే వాళ్ల వేలు ఉండటం మురగదాస్‌కు నచ్చలేదు.

అప్పటి నుండి కూడా మెగా ఫ్యామిలీకి దూరంగా ఉంటూ వచ్చారు. అయితే నిర్మాత ఠాగూర్‌ మదు విజ్ఞప్తి మేరకు చరణ్‌ను డైరెక్ట్‌ చేసేందుకు సిద్దం అయ్యాడు. ‘స్పైడర్‌’ విడుదలైన వెంటనే తమిళంలో విజయ్‌ హీరోగా ఒక చిత్రాన్ని చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత చరణ్‌తో మురగ సినిమా ఉంటుందేమో చూడాలి. మురగదాస్‌ దర్శకత్వంలో చరణ్‌ సినిమా చేస్తే తెలుగుతో పాటు తమిళం మరియు హిందీలో కూడా క్రేజ్‌ను సంపాదించుకోవచ్చు అనేది మెగా వర్గాల ప్లాన్‌. 2019లో కాని ఈ సినిమా వర్కౌట్‌ అయ్యేలా లేదు.

To Top

Send this to a friend