చరణ్‌ నిర్ణయంపై మెగా ఫ్యాన్స్‌ తీవ్ర నిరాశ

‘ధృవ’ చిత్రం వచ్చి చాలా నెలలు గడిచి పోతుంది. రామ్‌చరణ్‌ తర్వాత సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని మెగా ఫ్యాన్స్‌ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొన్ని కారణాల వల్ల రామ్‌ చరణ్‌ కొత్త సినిమా దాదాపు ఆరు నెలలు ఆలస్యంగా ప్రారంభం అయ్యింది. సినిమా షూటింగ్‌ ప్రారంభం అయిన తర్వాత కూడా కొన్ని ఇబ్బందుల వల్ల సరైన సమయంలో షూటింగ్‌ పూర్తి అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ముందుగా అనుకున్న ప్రకారం ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో సినిమాను విడుదల చేయాలని భావించారు. కాని ఇప్పుడు ఆరు నెలల ఆలస్యంగా సినిమాను విడుదల చేయబోతున్నారు.

నేడు రామ్‌చరణ్‌, సుకుమార్‌ల కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం టైటిల్‌ను ‘రంగస్థలం 1985’ గా ప్రకటిస్తూ విడుదల తేదీపై కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. సంక్రాంతికి సినిమా విడుదల అవ్వడం దాదాపుగా ఖాయం. కరెక్ట్‌ డేట్‌ అయితే ప్రకటించలేదు కాని సంక్రాంతికి సినిమా విడుదల అవ్వనుంది అని మాత్రం కన్ఫర్మ్‌ చేయడం జరిగింది. అయితే ఈ విషయాన్ని మెగా ఫ్యాన్స్‌ తప్పుబడుతున్నారు. ఇప్పటికే చరణ్‌ సినిమా చాలా ఆలస్యం అయ్యిందని, ఇంకా ఆలస్యం చేస్తున్నారంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

2016 చివర్లో ‘ధృవ’ చిత్రం విడుదలైంది. 2017లో మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ నటించిన చిత్రం ఒక్కటి కూడా విడుదల కావడం లేదు. 2018 జనవరిలో చరణ్‌ సినిమా విడుదల కాబోతుంది. అంటే 2017 మొత్తం చరణ్‌ వదిలేసినట్లుగా పరిగణించాలి. అందుకే ఈ నిర్ణయం పట్ల చరణ్‌ ఫ్యాన్స్‌ నిరాశను వ్యక్తం చేస్తున్నారు.

To Top

Send this to a friend