మెగా ఫ్యాన్స్‌కు బిస్కెట్‌ వేశాడు

మెగా ఫ్యాన్స్‌ గ్రూప్‌లు గ్రూప్‌లుగా విడిపోతున్నారు. ఇప్పటికే మెగా ఫ్యాన్స్‌, పవన్‌ ఫ్యాన్స్‌ అంటూ విడిపోయిన విషయం తెల్సిందే. ఇక మెగా ఫ్యాన్స్‌లో కొందరు పవన్‌ను సపోర్ట్‌ చేస్తుంటే మరి కొందరు మాత్రం అల్లు అర్జున్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు మెగా ఫ్యాన్స్‌లో అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ అంటూ సపరేట్‌గా తయారు అయ్యారు. అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ అంటూ కొందరు సోషల్‌ మీడియాలో ‘డీజే’ చిత్రానికి సంబంధించి పలు ప్రచారాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ‘డీజే’ చిత్రం కలెక్షన్స్‌ను కూడా భారీగా వారు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు.

సోషల్‌ మీడియాలో ఇటీవల అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ కొందరు ‘డీజే’ చిత్రం ‘ఖైదీ నెం.150’ చిత్రం కలెక్షన్స్‌ను క్రాస్‌ చేసిందని, అందుకు హరీష్‌ శంకర్‌ వ్యాఖ్యలు సాక్ష్యం అంటూ పోస్ట్‌ చేశారు. హరీష్‌ శంకర్‌ ఇటీవల తాము ప్రకటిస్తున్న కలెక్షన్స్‌ తప్పు అని నిరూపిస్తే సినిమాల నుండి తప్పుకుంటాను అంటూ ఛాలెంజ్‌ విసిరిన విషయం తెల్సిందే. ఆ ఛాలెంజ్‌ కారణంగానే మెగా ఫ్యాన్స్‌ అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ అంటూ విడిపోయి విభేదించుకుంటున్నారు.

అల్లు అర్జున్‌పై కోపంతో కొందరు డీజే ఆఫీస్‌పై దిల్‌రాజు ఆఫీస్‌పై దాడికి దిగిన విషయం తెల్సిందే. దాడి జరిగి 24 గంటలు కాకుండానే మెగా వేడుక అయిన ‘ఫిదా’ ఆడియో వేడుకలో దిల్‌రాజు మెగా ఫ్యాన్స్‌కు బిస్కెట్‌ వేసేలా మాట్లాడి అందరిని కూల్‌ చేశాడు. చిరంజీవి వంటి స్టార్‌ హీరో సినిమాతో మా సినిమాకు పోలీకే లేదు. కొందరు కావాలని ప్రచారం చేస్తున్నారు. ఖైదీ సినిమా స్థాయికి డీజే ఎప్పటికి పోలేదని, ఆ సినిమా స్పెషల్‌ అంటూ చిరంజీవిని ఆకాశానికి ఎత్తేశాడు. దాంతో మెగా ఫ్యాన్స్‌ కూల్‌ అయ్యారు.

To Top

Send this to a friend