‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కొత్త హోస్ట్‌ ఈయనే

హిందీలో ప్రసారం అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ‘కౌన్‌ బనేగా కరోడ్‌ పతి’ కార్యక్రమం తెలుగులో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’గా ప్రసారం అవుతున్న విషయం తెల్సిందే. ఇప్పటి వరకు నాలుగు సీజన్‌లు పూర్తి చేసుకుంది. మొదటి మూడు సీజన్‌లను నాగార్జున హోస్ట్‌ చేయగా, తాజాగా ప్రసారం అయిన కొత్త సీజన్‌కు మెగాస్టార్‌ చిరంజీవి హోస్ట్‌గా వ్యవహరించాడు. చాలా ఉత్సాహంగా మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమంను మొదలు పెట్టిన చిరంజీవి చివరకు నిరాశతోనే ముగించాడు. ఆశించిన స్థాయిలో చిరంజీవి హోస్ట్‌గా ఆ కార్యక్రమం సక్సెస్‌ కాలేదు. దాంతో ఆ తర్వాత సీజన్‌కు చిరంజీవి చేసేందుకు ఆసక్తి చూపడం లేదు.

మెగాస్టార్‌ చిరంజీవి నో చెప్పిన ఆ మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమాన్ని నడిపించేందుకు ఒక యువ హీరో ముందుకు వస్తున్నాడు. ఆయన మరెవ్వరో కాదు రానా. బాహుబలి సినిమాలో భల్లాలదేవుడిగా నటించి మెప్పించిన రానా ఇప్పుడు మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమంతో ఆకట్టుకుంటాను అంటున్నాడు. ప్రస్తుతం ఈయన తేజ దర్శకత్వంలో ‘నేనే రాజు నేనే మంత్రి’ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి అవ్వబోతుంది. ఆ తర్వాత మరో కొత్త సినిమాకు కమిట్‌ అయ్యాడు. ఆ సినిమాను కూడా పూర్తి చేసిన తర్వాత రానా ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కొత్త సీజన్‌ను ప్రారంభించబోతున్నాడు. ఇదే సంవత్సరం చివర్లో లేదా వచ్చే సంవత్సరం ప్రారంభంలో ఎంఈకే కొత్త సీజన్‌ ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి. నాగార్జున, చిరంజీవిల తర్వాత రానా చేయబోతున్నాడు. మరి రానా ఆకట్టుకుంటాడా అనేది చూడాలి.

To Top

Send this to a friend