మరో సంచలనం


జల్సాతో పవన్ ఈగోను త్రివిక్రమ్ బాగానే టచ్ చేశాడు. పవన్ కు కమ్యూనిస్టులు అన్నా.. నక్సలైట్లు అన్నా అభిమానం ఎక్కువ. అందుకే అందమైన ప్రేమకథలో ఓ చిన్న నక్సలైట్ పోరాటాన్ని అంతర్లీనంగా కథలో ఇనుమడింప చేసి చూపించారు. అది జల్సాగా అభిమానులను అలరించింది. ఆ తర్వాత ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా అత్తారింటికి దారేది సూపర్ హిట్ అయ్యింది. ఇందులో ప్రేమ, బంధాలు చూపించారు. ఇప్పుడు వరుస రెండు హిట్ ల తర్వాత మూడో చిత్రం త్రివిక్రమ్-పవన్ ల కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటోంది.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కుతోంది. పవన్ ఇందులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా నటిస్తున్నారు. రామోజీఫిలిం సిటీలో వేసిన ప్రత్యేక సెట్ లో ఈ మేరకు షూటింగ్ మొదలైంది. ఆగస్టులో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. త్రివిక్రమ్ చిత్రాలకు సంగీతం అందించే దేవీ శ్రీ ప్రసాద్ మాత్రం ఈ చిత్రానికి పనిచేయడం లేదు. తమిళ సంగీత తరంగం అనిరుధ్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కథ కావడంతో ఆ నేపథ్యం నుంచి వచ్చిన అనిరుధ్ కు సంగీతం అప్పజెప్పినట్టు సమాచారం.

To Top

Send this to a friend