ఎమ్మెల్యే కనకయ్యకు బెదిరింపులు..?

మావోయిస్టుల పేరుతో ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్యకు కొందరు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు, చందాల కోసం అందిన హెచ్చరికలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. 20 రోజుల వ్యవధిలో రెండు సార్లు లేఖలు, మరో రెండు సార్లు ఫోన్ల ద్వారా మావోయిస్టుల పేరుతో హెచ్చరికలు అందాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కనకయ్యకు పోలీసు లు భద్రతను పెంచారు.

ఎమ్మెల్యే నిత్యం నియోజకవర్గంలోని మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటిస్తుండటంతో పోలీసు నిఘా విభాగాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఎమ్మెల్యే పర్యటన వివరాలను గోప్యంగా ఉంచాలంటూ పోలీసులు సూచించడమే గాక టేకులపల్లి మండలంలోని కోయగూడెంలో ఆయన నివాసం వద్ద భద్ర తా చర్యలు కట్టుదిట్టం చేశారు. నివాసం వద్ద సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పా టు చేశారు. విశ్వసనీయవర్గాల సమాచా రం ప్రకారం..

మావోయిస్టు పార్టీకి చెందిన ఒక నాయకుడి వైద్యచికిత్సల కోసం డబ్బు ఇవ్వాలంటూ తొలుత ఓ వ్యక్తి ఫోన్‌ ద్వారా కోరారు. తనకు వచ్చిన ఫోన్‌కాల్‌లో నిజమెంత అనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఇటీవల మరో గుర్తు తెలియని వ్యక్తి మావోయిస్టు పార్టీ పేరుతో కోయగూడెంలోని నివాసంలో ఎమ్మెల్యే లేని తరుణంలో వచ్చి పార్టీకి చందా ఇవ్వకుండా నిర్లక్ష్య చేస్తున్నారంటూ హెచ్చరించినట్లు తెలిసింది. ఒకసారి ఫోన్‌ లో తాను మావోయిస్టు పార్టీ కార్యదర్శి దామోదర్‌ నంటూ, మరోసారి హరిభూషణ్‌ను అంటూ చందాల కోసం డిమాండ్‌ చేశారు.

వీటిపై ఎమ్మెల్యే ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఎమ్మెల్యే లక్ష్యంగా కొందరు వ్యక్తులు వివిధ రీతుల్లో ఆరోపణలకు దిగుతుండటంతో ఆయనకు వస్తున్న ఫోన్‌కాల్స్‌, లేఖలపై పలు అనుమానాలు వ్యక్తం అవు తున్నాయి. దీంతో పోలీసు నిఘా విభాగాలు ఆరా తీస్తున్నట్లు తెలిసిం ది. ఆయన కు మావోయిస్టుల పేరిట వచ్చిన ఫోన్‌కా ల్స్‌, లేఖలను రహస్యంగా పరిశీలిస్తున్నట్లు తెలిసింది.

ఎమ్మెల్యే కనకయ్యకు మావోయి స్టుల పేరిట వస్తున్న బెదిరింపు కాల్స్‌, అం దిన లేఖల నేపథ్యంలో పోలీసులు భద్రతా చర్యలను పెంచారు. నివాస వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు ఎస్కార్ట్‌ వాహనాల్లో పోలీసుల సంఖ్యను పెంచడం గమనార్హం. జిల్లా పోలీసు నిఘా విభాగాలు టేకులపల్లి మండలంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, వివాదాల కోణంలో సైతం దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిసింది. ధ్రువీకరించిన ఎమ్మెల్యే కనకయ్య ఈ వ్యవహారంపై ‘ఆంధ్రజ్యోతి’ మంగళవారం ఎమ్మెల్యే కనకయ్యను వివరణ కోర గా ఫోన్‌కాల్స్‌, లేఖలు అందిన మాట నిజమేనని ధృవీకరించారు.

అయితే తాను ఏజ న్సీ ప్రాంతాల అభివృద్ధికి కృషిచేస్తున్నాని తెలిపారు. బెదిరింపులు, లేఖలు మావోయి స్టు పార్టీల నాయకులు ఇచ్చినట్టు తాను భావించడంలేదని పేర్కొన్నారు. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులే మావోయిస్టుల పేరుతో చందాలు, బెదిరింపులకు పాల్పడి ఉండవచ్చుననే అభిప్రాయం వ్యక్తంచేశా రు.. ఎమ్మెల్యే కనకయ్యకు వచ్చిన ఫోన్‌కాల్స్‌, లేఖలపై విచారణ జరుపుతున్నామని టేకులపల్లి సీఐ దోమల రమేష్‌ తెలిపారు

To Top

Send this to a friend