మంత్రి నారాయణ కొడుకు మృతి


ఏపీ మంత్రి నారాయణకు పుత్రశోకం మిగిలింది. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న నారాయణ కొడుకు మరణవార్త తెలియగానే హుటాహుటిన ఇండియాకు బయలు దేరారు. హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ రోడ్ నం. 36లో ఈ ఉదయం 3 గంటలకు జీహెచ్ఎంసీ మెట్రో పిల్లర్ ను నారాయణ కొడుకు నిషిత్ (23) ప్రయాణిస్తున్న బెంజ్ కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నిషిత్ తో పాటు అతడి స్నేహితుడు రవివర్మ కూడా ప్రాణాలు కోల్పోయాడు.

కారులో ఉన్న ఇద్దరిని పోలీసులు గుర్తించి ఆపోలో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు గుర్తించారు. వీరిద్దరూ మద్యం సేవించి ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. ప్రమాద సమయంలో సీటు బెల్ట్ పెట్టుకుంటే బతికేవారని కానీ పెట్టుకోకపోవడంతో ప్రాణాలు పోయాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ప్రస్తుతం నిషిత్ నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్ గా సేవలందిస్తున్నారు. నారాయణ కుటుంబ సభ్యులు నిషిత్ మృతదేహం ఉంచిన అపోలో ఆస్పత్రికి తరలివచ్చారు.

To Top

Send this to a friend