చరణ్‌ను వదిలేలా లేడుగా..!

రామ్‌చరణ్‌తో సినిమా చేయాలని తమిళ దర్శకుడు మణిరత్నం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు. వీరి కాంబినేషన్‌లో రెండున్నర సంవత్సరాల క్రితమే సినిమా ప్రారంభం అవ్వాల్సి ఉంది. కాని చరణ్‌ ఆ సమయంలో వరుసగా ఫ్లాప్‌లతో ఉన్నాడు. ఆ సమయంలో ప్రయోగం చేయవద్దనే ఉద్దేశ్యంతో సినిమాను క్యాన్సిల్‌ చేసుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరి కాంబోలో సినిమా గురించి మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి.

మణిరత్నంతో సినిమా చేయడం చరణ్‌కు పెద్దగా ఆసక్తి లేదని, అయితే చాలా కాలం క్రితం చేస్తాను అంటూ ఇచ్చిన మాట కోసం తప్పని సరి పరిస్థితుల్లో ఆయనతో ఒక సినిమా చేయాల్సి ఉందట. మణితో సినిమా అంటే మెగా ఫ్యాన్స్‌ కూడా కాస్త ఆందోళన చెందుతున్నారు. అప్పట్లో ఎన్నో అద్బుత చిత్రాలు చేసిన మణిరత్నం ఇప్పుడు మాత్రం పెద్దగా ఆకట్టుకోలేక పోతున్నాడు. గత పది సంవత్సరాల్లో ఒక్కటి రెండు సాదారణ సక్సెస్‌లు తప్ప గొప్ప చిత్రాలు ఏమీ కూడా మణి తీయలేక పోయాడు.

ఎంత తప్పించుకోవాలని ప్రయత్నించినా కూడా మణి మాత్రం చరణ్‌ను వదలడం లేదు. తాజాగా ఒక మల్టీస్టారర్‌ చిత్రాన్ని చరణ్‌ వద్దకు మణి పట్టుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ద్విభాష చిత్రంగా ఆ సినిమాను తెరకెక్కించే ప్రణాళికలో మణి ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ సినిమాలో ఒక హీరోగా చరణ్‌ను అనుకుంటున్న దర్శకుడు మరో హీరోలుగా దుల్కర్‌ సల్మాన్‌ మరియు ఫహాద్‌లు నటించే అవకాశాలున్నాయి. వచ్చే సంవత్సరంలో ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకు వెళ్లాలని మణి ఆశిస్తున్నాడు. ఈసారి మాత్రం చరణ్‌కు మణి దర్శకత్వంలో నటించక తప్పదనిపిస్తుంది.

To Top

Send this to a friend