తులసితో ఎన్నో ఉపయోగాలు..

తులసి ఆకుల రసం ఆయుర్వేదంలోనూ, ఇంటి వైద్యం చిట్కాలలోనూ విస్తృతంగా వాడుతారు. జలుబు, తలనొప్పి, పొట్టకు సంబంధించిన వ్యాధులు, వాపులు, గుండె జబ్బులు, విషాహారాలు, మలేరియా వంటి చాలా రకాల రుగ్మతలను నయం చేయడానికి తులసి వాడుతారు.
కొన్ని ఉపయోగాలు
తులసి ఆకులకు ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఈ ఆకులు నాడులకు టానిక్‌లాగా,
జ్ఞాపకశక్తిని పెంపొందించేవిగా పనిచేస్తాయి.

తులసి ఆకుల్ని పలురకాల జ్వరాల్లో ఉపశమనానికి ఉపయోగించుకోవచ్చు. వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ జ్వరం వ్యాప్తి తీవ్రంగా ఉన్నప్పుడు లేత తులసి ఆకుల్ని నీళ్లలో వేసి మరిగించి తాగితే ఈ రకం జ్వరాల నుంచి మంచి ఉపశమనం ఉంటుంది. జ్వరం మరీ తీవ్రంగా ఉంటే తులసి ఆకులనూ, యాలకుల పొడినీ కలిపి అరలీటరు నీళ్లలో మరిగించి కషాయం తయారు చేయాలి. అందులో చక్కెర, పాలు కలిపి తాగితే జ్వర తీవ్రత తగ్గుతుంది. తులసి ఆకుల్ని మెత్తగా నూరి నీటిలో కలుపుకుని రెండుమూడు గంటలకోసారి తాగొచ్చు.
పలురకాల ఆయుర్వేద దగ్గు మందుల్లో తులసిని తప్పకుండా కలుపుతారు. బ్రాంకైటిస్‌, ఆస్థమాల్లో కఫాన్ని తొలగించటంలో తోడ్పడుతుంది. తులసి ఆకుల్ని నోట్లో పెట్టుకుని నమలటం వల్ల జలుబు, ఫ్లూ నుంచి ఉపశమనం లభిస్తుంది.
తులసి ఆకులతో మరిగించిన నీళ్లను తాగితే గొంతులో గరగర నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ నీళ్లతో నోటిని పుక్కిలించినా మంచి ప్రయోజనం కనిపిస్తుంది.
చిన్నపిల్లల్లో సర్వసాధారణంగా కనిపించే దగ్గు, జలుబు, జ్వరం, డయేరియా, వాంతులు వంటి సమస్యలకు తులసి ఆకుల రసాన్ని తాగిస్తే మంచి ఉపశమనం కనిపిస్తుంది.
ప్రతిరోజు 5 లేదా 6 ఆకులు, మిరియాలు, ధనియాలు కలిపి నూరి తింటే వాంతులు, దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది. నులిపురుగులు నశిస్తాయి.

ఎండిన తులసి ఆకులను ధాన్యం నిలవ చేసిన చోట్ల ఉండుతారు – కీటకాలను దూరంగా ఉంచడం కోసం. ఆకుల రసం (పసరు), ఎండిన ఆకుల పొడి, మరగించిన నీరు, హెర్బల్ టీ, నేతిలో మరగ పెట్టడం – ఇలా తులసిని చాలా విధాలుగా తీసుకోవచ్చును. ఇటీవల అధ్యయనాలలోని ఫలితాల ప్రకారం చాలా నొప్పి నివారక పదార్ధాలలాగా తులసి ఒక COX-2 inhibitor కావచ్చును. ఇందుకు కారణం తులసిలో అధిక మోతాదులో ఉన్న యూజినాల్’ (Eugenol) (1-హైడ్రాక్సీ-2-మీథాక్సీ-4-అల్లైల్ బెంజీన్).

ఇంకా ఇతర అధ్యనాలలో తులసికి రక్తంలో చక్కెర మోతాదును తగ్గించగలిగే శక్తి తులసికి ఉంది. కనుక డయాబెటిస్ (చక్కెర వ్యాధి) వైద్యంలో కూడా తులసి పనికొస్తుంది.

రక్తంలో కోలెస్టరాల్ను తగ్గించడానికీ, ‘యాంటీ ఆక్సిడెంట్’ గుణాల వలన బ్లడ్ షుగర్ తగ్గించడానికీ కూడా పనికొచ్చే పదార్ధాలు తులసిలో ఉన్నాయని మరి కొన్ని పరిశోధనలలో తేలింది.

‘రేడియేషన్’ కు గురైనందువలన కలిగే విషమ పరిస్థితి నుండి రక్షణకు కూడా తులసి ఉపయోగ పడవచ్చునని కొన్ని అధ్యయనాలు సూచించాయి.

అలాగే కంటి శుక్లాల సమస్యకు కూడా.

రెండు స్పూనుల తులసి రసాన్ని కొద్దిగా తేనె కలిపి తాగితే పైత్యం తగ్గుతుంది.
మూత్ర విసర్జన సమయంలో మంటతో బాధపడేవారు తులసి ఆకులను దంచి, ఆ రసానికి కొద్దిగా పాలు, చక్కెర కలిపి తాగడం వలన ఉపశమనం దొరుకుతుంది.
తులసి ఆకులను నూరి మొఖానికి రాసుకుంటే మచ్చలు, మరకలు పోయి ముఖం అందంగా కాంతివంతంగా మారుతుంది.
10 గ్రాములు తులసి ఆకులు రసాన్ని, 20-30 గ్రాముల తాజా పెరుగు లేక 2-3 స్పూన్లు తేనెలో కలిపి తినడం వలన క్యాన్సర్ నయం అయ్యే అవకాశం ఉంది.
ప్రతి రోజు రెండుసార్లు 12 తులసి ఆకులను తినడం వలన రక్త శుద్ధి జరుగుతుంది మరియు ఒత్తిడి తగ్గి మనసు ఉత్తేజితం అవుతుంది.
తులసి ఆకులను మజ్జిగతో కలిపి సేవిస్తే బరువు తగ్గుతారు.
తులసి ఆకులు తినడం వలన చెడు శ్వాస తగ్గుతుంది.
జలుబు, దగ్గు లాంటివి బాధిస్తున్నప్పుడు మాత్రల్ని వాడతాం. ఈసారి అలాంటి లక్షణాలు కనిపించినప్పుడు మాత్రల కన్నా.. కొన్ని తులసి ఆకుల్ని నమిలి చూడండి. వాటివల్ల జలుబు, దగ్గు మాత్రమే కాదు, మరికొన్ని సమస్యలూ అదుపులోకి వస్తాయి.
తులసి, తేనె కలిపి పరగడుపున తీసుకోవడం వల్ల కొన్ని పోషకాలు, విటమిన్లు పుష్కలంగా అందుతాయి. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఈ కాలంలో వచ్చే పలు ఇన్‌ఫెక్షన్లు దూరంగా ఉంటాయి. చిన్నారులకు తులసి అలవాటు చేయడం చాలా మంచిది.
ఈ కాలంలో జలుబు, దగ్గు ఎక్కువగా బాధిస్తాయి. అలాంటప్పుడు తులసి ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది. రకరకాల వైరస్‌లూ దూరం అవుతాయి. ఇతర వ్యాధులు కూడా ఇబ్బంది పెట్టవు. జలుబు త్వరగా తగ్గుతుంది.
దగ్గుతో బాధపడుతున్నవారు తులసి ఆకులను మెత్తగా చేసి అందులో తేనె, కొద్దిగా మిరియాలపొడి కలిపి తీసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల రాత్రిళ్లు దగ్గు బాధించదు. తొందరగా అదుపులోకి వస్తుంది.
అలర్జీలు ఉన్నవారు తేనె, తులసి తీసుకుంటే చాలా మంచిది. ఇందులో యాంటీసెప్టిక్‌ గుణాలు అధికం. చర్మ సంబంధిత అలర్జీలు తగ్గుతాయి.
తులసి తినడం వల్ల వయసు పైబడుతున్న లక్షణాలు తగ్గుతాయి. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు కొత్త కణాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. చర్మం యౌవనంగా ఉండటానికి తోడ్పడతాయి.
తులసిని తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు కరిగిపోతాయి. మూత్రంలో వ్యర్థాలను తొలగించే గుణం తులసిలో ఉంది. అలానే కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. గుండెకు రక్తప్రసరణ సక్రమంగా అవుతుంది. హృద్రోగాలూ దూరం అవుతాయి.

To Top

Send this to a friend