పిక్చర్స్ పతాకం పై మనోజ్ నందన్, ప్రియసింగ్ హీరో, హీరోయిన్ గా సత్యవరపు వెంకటేశ్వరరావు దర్శకత్వoలో, హసీబుద్దిన్ నిర్మాతగా రూపుదిద్దికున్న చిత్రం మనసైనోడు.ఈ చిత్రంలో డాక్టర్.సి. నారాయణ రెడ్డి గారు
“జయ జయ హే భరతావని పావని సద్గుణ గణ సముపేతా
గంగా యమునా గౌతమి కృష్ణా సలిల తరంగ సమేతా
జేజేలు జేజేలు శతకోటి జేజేలు జగమంతా చేసే జయ నాదాలు
ధ్యేయo దైర్యం గమనం గమ్యం వదలని నైజo మనదే
సస్యశ్యామల సౌభ్రాతృత్వపు దివ్య భారతo మనదే
జయ జయ హే భరతావని పావని సద్గుణ గణ సముపేతా” అంటూ మన భారతదేశ గొప్పతనాన్ని ప్రతి భారతీయుడు గర్వంగా తల ఎత్తుకుని పాడుకునే విధంగా ఒక గొప్ప దేశభక్తీ గీతాన్ని రచిoచారు. ఇంతటి గొప్ప పాట రచించిన డాక్టర్.సి. నారాయణ రెడ్డి గారి ఆఖరి చిత్రం మనసైనోడు అవ్వడం చాలా బాధగా ఉందని దర్శకుడు తెలియజేసాడు. ఈ గీతాన్ని డాక్టర్.సి. నారాయణ రెడ్డి గారికి అంకితం చేస్తున్నట్లు నిర్మాత హసీబుద్దిన్ తెలియజేసారు.
