మల్లారెడ్డి.. నువ్ సూపరెహె..


మల్లారెడ్డి.. మల్లారెడ్డి అన్నింట్లోనూ బెస్టేనంట.. ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు, రంగారెడ్డి జిల్లా అంతటా విస్తరించిన విద్యావ్యవస్థతో విద్యాప్రముఖుడు కాస్త 2014 ఎన్నికల్లో పోటీచేసి పొలిటీషియన్ అయిపోయాడు.. తెలుగు దేశం నుంచి మల్కాజ్ గిరి ఎంపీ స్థానంలో పోటీ చేసి గెలుపొందాడు. కొత్తలో కేసీఆర్ ను, టీఆర్ఎస్ నేతలను తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టాడు. ఆ తర్వాత తన కాలేజీలపై రైడ్లు తనిఖీలు రావడంతో ఫ్లేటు ఫిరాయించాడు. కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం టీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నాడు.

కానీ మల్లారెడ్డిలో పాత వాసనలు ఇంకా పోలేదు.. అందుకే తాను టీఆర్ఎస్ లో ఉన్నానన్న సంగతి మరిచిపోయి పుసుక్కున జై తెలుగుదేశం అనేశారు.. మల్లారెడ్డి విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ వీడ్కోలు సమావేశానికి మల్లారెడ్డితో పాటు కేసీఆర్ కుమార్తె, ఎంపీ కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి ఆవేశంగా.. అనాలోచితంగా మాట్లాడారు.. ‘మల్లారెడ్డి గ్రేట్ అంటూ తనకు తాను కీర్తించుకున్నారు. చివరకు జై టీఆర్ఎస్ అనబోయి.. జై తెలుగుదేశం’ అన్నారు. దీంతో వేదిక మీద, కింద ఉన్నోళ్లందరూ ఘోళ్లున నవ్వేశారు. విషయం గ్రహించిన మల్లారెడ్డి.. మళ్లీ గట్టిగా.. ‘జై కేసీఆర్.. జై కవితక్క’ అంటూ మాట మార్చారు..

ఇక ఆ తరువాత మైక్ అందుకున్న ఎంపీ కవిత.. మల్లారెడ్డి తనదైన శైలిలో సెటైర్లు వేశారు.. ‘మల్లారెడ్డికి ఇంకా ఆ పచ్చ వాసనలు పోలేదని.. పింక్ రంగుకు ఇంకా అలవాటు పడాల్సి ఉందని ’ కవిత వ్యాఖ్యానించారు. అయితే నాది కూడా తప్పేనని.. మల్లారెడ్డి ఫంక్షన్ కు పసుపు చీర కట్టుకొని రావడంతో టీడీపీ జపం చేశారని కవిత సరదాగా వ్యాఖ్యానించారు.

ఈ సరదా వీడియోలను కింద లింక్ లో చూడొచ్చు..

To Top

Send this to a friend