తెలుగు రాజకీయాలకే మహేశ్ టార్గెట్..?

 

అది సాదా సీదా కథ కాదట.. తెలుగు రాజకీయాలను కుదిపేసే కథ అట.. తెలుగులో అగ్ర దర్శకుడిగా కొనసాగుతున్న కొరటాల శివ ఇప్పుడు రాజకీయాలపై ఫోకస్ పెట్టి స్టార్ హీరో మహేశ్ బాబు హీరోగా తెరకెక్కిస్తున్న మూవీ సంచలనంగా మారింది. తెలుగు రాజకీయాలను గురిపెట్టి అల్లిన ఈ కథాంశం ఆసక్తి రేపుతోంది. ఇందులో ఏఏ అంశాలను ఫోకస్ చేయబోతున్నాడనేది ఉత్కంఠగా మారింది.

ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల్లో చాలా పరిణామాలు సంభవించాయి. రెండు రాష్ట్రాలుగా విడిపోవడం.. కుట్రలు , కుతంత్రాలు, ఓటుకు నోటు సహా చాలా జరిగాయి. మరి కొరటాల ఇందులో ఏ అంశాన్ని బేస్ చేసుకొని మహేశ్ ను సీఎంగా రాజకీయ స్టోరీ అల్లాడోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  స్వతహాగా రైటర్ అయిన కొరటాల శివ తన రెండు గత చిత్రాల్లో డిఫెరెంట్ కథాంశాలను చక్కగా ప్రజెంట్ చేసి హిట్ కొట్టాడు. తొలిచిత్రం మిర్చి పక్కనపెడితే.. ‘తరువాత శ్రీమంతుడు, జనతాగ్యారేజ్ లో సామాజిక అంశాలను చాలా చక్కగా ఎలివేట్ చేశాడు..

స్పైడర్ సినిమా షూటింగ్, టాకీని నిన్నటి వరకు పూర్తి చేసుకున్న మహేశ్ బాబు.. ఈరోజు నుంచి కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘భరత్ అనే నేను..’ అనే రాజకీయ నేపథ్య కథలో నటించబోతున్నారు. ఇందులో మహేశ్ బాబు సీఎంగా నటిస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.. అందుకోసం హైదరాబాద్ శివారులో ఓ అసెంబ్లీ సెట్ కూడా వేశారు. సంక్రాంతికి విడుదల చేసే ఈ సినిమాకు సంగీతాన్ని దేవీ శ్రీ ప్రసాద్ అందిస్తున్నారు.

To Top

Send this to a friend